న్యూస్

Reliance : రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త వ్యాపారం.. కస్టమర్లకు ఇక పండగే.!

Reliance
Share

Reliance : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటికప్పుడు భవిష్యత్ కార్యాచరణలకు అనుగుణంగా అప్ డేటెడ్ గా ముందడుగు వేస్తోంది. అవును.. ఓమ్ని చానల్ బ్యూటీ ప్లాట్‌ఫామ్‌ను కస్టమర్లకు అత్యంత సమీపంగా తీసుకురావాలని అనుకుంటోంది. త్వరలోనే ఈ అంశానికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన ఉండొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కాస్మటిక్స్ టు ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ నైకా, మింత్రా వంటి వాటికి పోటీగా ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ సరికొత్త కొత్త ప్లాట్‌ఫామ్‌ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

Reliance : మరో ఫ్యాషన్ ప్రపంచం అందుబాటులోకి రానుంది.!

Mukesh ambani Reliance

RIL తాజాగా ఫైండ్, నెట్‌మెట్స్ వంటి కంపెనీలను కొన్న విషయం తెలిసినదే. వీటి ద్వారానే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నూతన వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఫైండ్, నెట్‌మెట్స్ సంయుక్తంగా ఈ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించనున్నాయి. వేర్ హౌసింగ్, డేటా మేనేజ్‌మెంట్ వంటి పనులను నెట్‌మెడ్స్ చూసుకోనుంది. ఇక ఫైండ్ అనేది కస్టమర్ ఇంటర్‌ఫేస్ వంటి సేవలు అందుబాటులో ఉంచనుంది. ఈ రెండింటి సాయంతో ముకేశ్ అంబానీ కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకున్న బ్రాండ్ కంపెనీలు ఇవే..

ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ దాదాపుగా అర డజనుకు పైగా కాస్మటిక్, బ్యూటీ బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకోవడం కొసమెరుపు. సదరు కంపెనీ ప్రొడక్టులను కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించనున్నారు. బ్యూటీ మార్కెట్‌ విభాగంలో కొత్త కొత్త ఈకామర్స్ కంపెనీల రాకతో అంబానీ కూడా ఈ విభాగంపై ఫోకస్ చేశారు. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఈ విభాగంలోనూ సత్తా చూపాలని భావిస్తున్నారు. ఇక ఈ రిలయన్స్ కొత్త బ్రాండ్ పేరు కోసం ‘టియారా’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.


Share

Related posts

బిగ్ బ్రేకింగ్: టీటీడీ పై జగన్ సంచలన నిర్ణయం..?

CMR

హైదరాబాద్ ‌లో హాట్ హాట్ రాజకీయం .. రాష్ట్రం మొత్తం ఇదే టాక్ !

sridhar

AP CM YS Jagan: జగన్ రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar