ట్రెండింగ్ న్యూస్

రిలయన్స్ నుండి మరో సంచలనం..! వచ్చే ఏడాది జూన్ తర్వాత ఇక విప్లవమే..!!

Share

 

 

భారత్ దేశంలో మొదటిగా 4G సర్వీస్ ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో, ఇప్పుడు 5G గురించి కూడా కీలక ప్రకటనలు చేసింది. మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.. రిలయన్స్ జియో 5G ని మొదటి నుంచి భారతదేశంలో పరీక్షించామని అంబానీ తెలిపారు. ఇది జియోను భారతదేశంలో “ప్రపంచ స్థాయి 5 జి సర్వీస్” గా ప్రారంభించటానికి వీలు కల్పిస్తుంది. భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే 5 జి సొల్యూషన్ ట్రయల్‌కు సిద్ధంగా ఉంటామని, వచ్చే ఏడాది నాటికి తమ ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్ ‌కు కంపెనీ సిద్ధంగా ఉందని అంబానీ తెలిపారు. జియో అందించే 5జీ సర్వీస్ కేంద్రప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్‌కు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.

 

India-To-Witness-5G-Services-By-Second-Half-Of-2021-Says-Mukesh-Ambani

భారతదేశ డిజిటల్ విప్లవం గురించి మాట్లాడుతూ కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి కాలంలో భారతదేశం లో 4జీ నెట్వర్క్ డిజిటిల్ మొబైల్ సేవలు ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. డిజిటల్ ఫస్ట్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి గల ప్రాముఖ్యతను వివరించారు.భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా వృద్ధి చెందుతుందో వివరించడంతో పాటు డిజిటల్ రంగంలో ముందంజలో ఉండటానికి కావాల్సిన నాలుగు ఐడియాలను ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నారు.

నాలుగు ఆలోచనలు:
ఈ నాలుగు ఆలోచనలో భాగంగా, మొదటిగా ఇప్పటికి కూడా 2జీ సేవలని వినయోగిస్తున్న 30కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు సైతం సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించేందుకు కావాల్సిన విధానపరమైన చర్యల్ని వెంటనే తీసుకోవాలి అని ప్రధాని ని కోరారు అంబానీ. దీని వల్ల ప్రతి ఒకరు తమ బ్యాంక్ అకౌంట్లకు ప్రత్యక్ష నగదు బదిలీ పొందగలరు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో చురుగ్గా పాల్గొంటారు అనే విషయాన్ని తెలియ చేసారు.

డిజిటల్‌గా కనెక్ట్ అయిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే 5జీ సర్వీసులు ఎంతో ముఖ్యమని అన్నారు. మనదేశంలో 5జీని తీసుకురావడానికి క్వాల్‌కాం, శాంసంగ్‌లతో కలసి జియో పని చేస్తోంది. స్పెక్ట్రం అందుబాటులోకి రాగానే 5జీ టెస్టింగ్‌ను ప్రారంభిస్తామని అంబానీ గతంలోనే తెలిపారు. 5జీ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చేలా విధానపరమైన చర్యల్ని తీసుకోవాలని అయినా కోరారు. 2021 రెండో అర్థభాగం నాటికి 5జీ విప్లవంలో జియో మార్గదర్శకంగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాను. స్వదేశంలో అభివృద్ధి చేసిన నెట్వర్క్, హార్డ్‌వేర్, టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుందని అయినా చెప్పారు.

Mukesh-Ambani-IMC-2020

ఇక జియో ప్లాట్‌ఫామ్స్ గురించి అయినా వివరిస్తూ, భారతదేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆశయాలకు తమ ప్రయత్నం మద్దతుగా ఉంటుందన్నారు ముఖేష్ అంబానీ. విద్య, వైద్య, వ్యవసాయ, మౌలిక సదుపాయాల, ఆర్థిక సేవల, సరికొత్త వాణిజ్యం లాంటి రంగాల్లో వినూత్నమైన టెక్నాలజీకి జియో సర్వీసులు ఎలా ఉపయోగపడుతుందో అయినా తెలిపారు. “20 స్టార్టప్ పార్ట్‌నర్స్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్‌లో ప్రపంచ స్థాయి సామర్థ్యాలను సృష్టించింది. ఇందులో ప్రతీ ఒక్కటి భారతదేశంలో సత్తా నిరూపించిన తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం కూడా అందివ్వనుంది” అని అన్నారు.

ఇక చివరగా భారతదేశాన్ని హార్డ్‌వేర్ తయారీ హబ్‌గా మార్చాలని పిలుపునిచ్చారు ముఖేష్ అంబానీ. అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు భారతదేశంలో అడుగుపెట్టి, వారి హార్డ్‌వేర్ తయారు చేసేందుకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎంతో కృషి చేస్తున్నారు అన్ని అయినా పేర్కొన్నారు.సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ పరిశ్రమగా భారతదేశ సామర్థ్యాన్ని గుర్తు చేశారు. “ఈ రంగానికి చెందినవారంతా కలిసి పనిచేస్తే, హార్డ్‌వేర్ రంగంలో భారతదేశం విజయం తథ్యం అని సాఫ్ట్‌వేర్‌లో మనం సాధించిన విజయాలతో సమానంగా హార్డ్‌వేర్‌లో విజయం సాధించొచ్చు” అని వివరించారు ముఖేష్ అంబానీ.

ప్రస్తుతం ప్రారంభ స్థాయి 4జీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను కూడా రూపొందిస్తుంది. దీని ధర రూ.4,000లోపే ఉండనుందని , ఈ ఫోన్ వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది అని అయినా తెలిపారు

 


Share

Related posts

మోదీ అంటే ప‌వ‌న్‌కు ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలుసా?

sridhar

సూపర్ స్ట్రాటజీ: నిమ్మగడ్డ ఎపిసోడ్ ని తనకి అనుకూలంగా మార్చుకుని జనం దగ్గర మార్కులు కొట్టేసిన జగన్

somaraju sharma

TDP: అచ్చెన్న వీడియో వైరల్ చేసిన వైసీపీ..! జగన్ పై సీరియస్ కామెంట్స్ చేసిన అచ్చెన్న..!!

somaraju sharma