NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్ధికి హైకోర్టులో ఊరట

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో డిబార్ అయిన హరీష్ అనే విద్యార్ధికి హైకోర్టులో ఊరట లభించింది. వరంగల్లు జిల్లాలోని కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీక్ అయి వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో విద్యార్ధి హరీశ్ వద్ద నుండి హిందీ పేపర్ బయటకు వచ్చినట్లు తేలడంతో చీఫ్ సూపర్నిటెండెంట్ అతన్ని అయిదేళ్ల పాటు డిబార్ చేశారు.

Telangana High Court

 

తాను ఏ తప్పు చేయలేదనీ, అయిదేళ్ల పాటు తనను ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయడం అన్యాయమని బాధిత విద్యార్ధి బోరున విలపించాడు. గురువారం హరీష్ కమలాపూర్ జడ్ పీ హైస్కూల్ పాఠశాలలో ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి వెళితే .. హనుమకొండ డీఈఓ అతన్ని పిలిచి నీ కారణంగా ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని మందలించారు. పరీక్ష రాయవద్దంటూ అతన్ని బయటకు పంపించడంతో పాటు హాల్ టికెట్ ను తీసుకున్నారు. దీంతో బయటకు వచ్చిన అనంతరం విద్యార్ధి హరీశ్ బోరున విలపించాడు. కుమారుడు బాధపడుతుండటంతో హరీష్ తండ్రి … విద్యాశాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

శివకృష్ణ అనే వ్యక్తి గోడ దూకి కమలాపుర్ పరీక్షా కేంద్రంలోకి వచ్చి పరీక్ష రాస్తున్న తన కుమారుడు హరీష్ ను భయపెట్టి హిందీ ప్రశ్న పత్రం తీసుకున్నాడని బాధితుడి తండ్రి పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే అతని ప్రశ్నపత్రం తీసుకుని సెల్ ఫోన్ లో ఫోటో తీసుకున్నాడని, అదే ప్రశ్న పత్రం వాట్సప్ లో చక్కర్లు కొట్టిందని ఆయన వివరించాడు. ఈ వ్యవహారంలో తన కుమారుడు ఏ తప్పు చేయలేదనీ, భయపడే ప్రశ్నాపత్రం ఇచ్చాడని పిటిషన్ లో పేర్కొన్నాడు. మొదటి సారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న తన కుమారుడిని పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, అతని భవిష్యత్తు కాపాడాలని హైకోర్టును అభ్యర్ధించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం.. బాధిత విద్యార్ధి హరీశ్ ను సోమవారం నుండి మిగిలిన పరీక్షలకు హజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించారు.

మోడీ నోట.. జగన్ మాట

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!