Hiccups:ఛాతీ భాగాన్ని, పొట్ట భాగాన్ని వేరు చేస్తూ మన కడుపులో డయాఫ్రం అనే పొర ఉంటుంది. ఈ పొర పైకి క్రిందకు కదులుతుంటుంది. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు డయాఫ్రం కిందకు సాగి గాలి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా సహాయపడుతుంది. అలాగే మనం ఉపిరి వదులుతున్నప్పుడు అది పైకి ముడుచుకొని గాలి బయటకు వెళ్ళేలా సహాయపడుతుంది. కాని అప్పుడప్పుడు ఈ డయాఫ్రం కదలికలో మార్పు వచ్చి మన ఉపిరి తో సంబంధం లేకుండా కదులుతూ ఉంటుంది.
ఆ సమయం లో నే మనకు ఎక్కిళ్ళు వస్తుంటాయి . డయాఫ్రం వేగంగా పైకి కదలడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి కూడా అంతే వేగంగా బయటకు రావడం వల్ల మన స్వరపేటిక పై ఒత్తిడి పడి శబ్దం బయటకు వస్తుంటుంది.అయితే, ఎక్కిళ్ళు రాకుండా ఉండాలంటే ఎక్కిళ్లు ప్రేరేపించే విషయాలు, తినుబండారాల కు దూరంగా ఉండవలసి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం. మద్యం తాగడం, సిగరెట్ కాల్చడం వంటివి మానేయాలి .కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. హఠాత్తుగా ఆందోళన చెందడం, ఉత్తేజితమవటం వంటివి చేయకూడదు.గబగబా తినే అలవాటును కూడా మానుకోవాలి. ఆహారం ఎక్కువగా తినడం, తాగడాన్ని తగ్గించుకోవాలి.
ఒకవేళ ఎక్కిళ్లు ఆగాలి అని అనుకుంటే ఈ కింది చిట్కాలు పాటించి చూడండి .ఒక నిమ్మకాయ కొరికితే వెక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి. ముక్కును గిల్లడం, కొద్దిసేపు ఊపిరి బిగపట్టడం వంటివి కూడా బాగా పనిచేస్తాయి. నోట్లో నీరు పోసుకుని నోరు పుక్కిలించడం లేదా చల్లని నీరు తాగడం వల్ల ఎక్కిళ్లుఆగేలా చేయవచ్చు.లేదా నీటిని ఒక్కొక్క గుటక చాలా నెమ్మదిగా మింగడం వలన కూడా సమస్య తగ్గుతుంది. ఒక స్పూన్ చక్కెర నోట్లో వేసుకోవడం లేదా తేనె ను తీసుకున్న కూడా ఎక్కిళ్లు ఆగిపోతాయి .