NewsOrbit
న్యూస్ హెల్త్

Snoring: మీ గురకతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి!!

Remedies for snoring

Snoring: మానసికంగా ఆందోళనలు ఉంటే నిద్ర పట్టడం కష్టం గా నే  ఉంటుంది .బలవంతం గా  నిద్ర కోసం ప్రయత్నం చేసి  కళ్లు మూసుకున్నా ఏవేవో నీడలు, వింత వింత ఆకారాలు, నల్లటి రంగులు కనిపిస్తూ నిద్ర చెడగొడతాయి. ఇవన్నీ చాలవన్నట్టు,  పక్కనున్న వాళ్లు గురక పెడుతూ ఉంటే… ఇక నిద్ర దరిదాపుల్లో లేకుండా పోతుంది.భర్త పెట్టే గురక భరించలేక విడాకులు తీసుకున్న భార్యల కేసులు కూడా ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. దీన్ని బట్టి గురక అనేది పక్క వాళ్లను ఎంతలా ఇబ్బంది పెడుతుందో తేలికగా అర్థం అవుతుంది.

Remedies for snoring
Remedies for snoring

సరిగా ఆలోచిస్తే గురకను పోగొట్టుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ముఖ్యంగా టెన్నిస్ బాల్‌తో పని బాగా జరిగి  త్వరగా పరిష్కారంపొందవచ్చట. అంటే… గురక పెట్టి నిద్ర పోతున్న వ్యక్తి పై టెన్నిస్ బాల్‌ విసిరేస్తే… గురక వదిలిపోతుంది అనుకుంట అని ఆలోచిస్తున్నారా? అలాంటిది ఏమి కాదు. డాక్టర్స్ ఏమంటున్నారంటే, గురకకూ,మనం పడుకు నే బెడ్డుకీ సంబంధం ఉందంటున్నారు. అతిగా బెడ్‌పై నిద్రపోయేవారికి గురక రావడం చాల సహజం అంటున్నారు.

అసలు గురక ఎందుకు వస్తుందంటే, కొంత మంది నిద్రపోయేటప్పుడు నోరు తెరచి నిద్ర పోతుంటారు. అప్పుడు వారు ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా గాలి పీల్చి, వదులుతుంటారు.అప్పుడు నోట్లోంచీ గాలి ముక్కు రంధ్రాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అక్కడ అలా వెళ్లేందుకు దారి పెద్దగాఉండకపోవడం తో గాలిని బలవంతంగా నెట్టివేసినట్లు అవుతుంది. దాంతో పెద్ద ఎత్తున శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్నే గురక అంటాము.

అలా జరగకుండా ఉండాలంటే… నిద్రపోయేటప్పుడు తలగడ వేసుకోకుండా ఉండడం మంచిది.తలగడ లేకుండా నిద్ర పోవడం ఎలా అనిపిస్తే,తక్కువ ఎత్తు ఉన్నది వాడుకోవచ్చు. ఆమ్మో అలా కుదరదు అనుకుంటే… టెన్నిస్ బాల్‌ని రంగంలోకి దింపాలిసిందే.డాక్టర్లు ఇచ్చే సలహా ఏమిటంటే,టెన్నిస్ బాల్‌ను షర్ట్ వెనక వైపు వేసుకొని నిద్రపోమని చెబుతున్నారు. ఇలా వెనక వైపు పాకెట్ ఉండే డ్రెస్సులు కూడా ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ల లో అందుబాటులో ఉన్నాయి.

ఇలా టెన్నిస్ బాల్ వెనక వేసుకున్నప్పుడు,వెల్లకిలా(పొట్ట పైకి వచ్చేలా) ఎవరూ నిద్ర పోలేరు. ఎందుకంటే వీపు  కింద బాల్ అడ్డువస్తుంటుంది. అటుపక్కకో,ఇటు పక్కకో తిరిగి పడుకుంటారు.. దానివలన గురక వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.దీన్ని బట్టి వెల్లకిలా పడుకుంటే గురక వెంటనే వస్తుంది అని మరిచి పోకూడదు.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N