పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పిల్లలతోనే ఉంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా రాణిస్తోంది. అంతేకాకుండా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమా రంగం లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం రేణు రెడీ అయింది. ఈ నేపథ్యంలో సినిమా సెట్ లో ఏ విధంగా మేకప్ వేస్తున్నారు, షూటింగ్ స్పాట్ లో జరిగే విషయాలు అన్నిటినీ వీడియో రూపంలో రేణు దేశాయ్ షేర్ చేస్తూ ఉంది.
దీంతో రేణుదేశాయ్ ఒకవైపు బుల్లితెర మరోవైపు వెండితెర పై బిజీ అవుతూ వెబ్ సిరీస్ చేయటానికి కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కూతురు ఆద్యాకు ఫోటోగ్రఫీ లో ఉన్న టాలెంట్ గురించి రేణు సోషల్ మీడియాలో చెబుతూనే ఉంటది. ఆధ్య తీసిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల తాజాగా రేణు దేశాయ్ తన ఫోటో ఒకటి షేర్ చేసింది.
న్యాచురల్ గా నవ్వుతూ రేణు దేశాయ్ ప్రకృతిని ఆస్వాదిస్తూ…. స్విమ్మింగ్ పూల్ వద్ద క్యాజువల్ గా కూర్చుని ఆహ్లాదం చెందుతున్న ఫోటో ఒకటి క్లిక్ మనిపించి నట్టు ఉంది. ఆ ఫోటో ని వేణు ఇటీవల షేర్ చేసి.. నా కూతురు ఆధ్య తీసింది అంటూ ఆమె పై ప్రశంసలు కురిపించింది. చాలా అద్భుతమైన ఫ్రేమింగ్ సూపర్ అంటూ రాక్ స్టార్ అని టైటిల్ ఇచ్చి పొగడ్తలతో ముంచెత్తింది.