రేణుదేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి విషయంపై స్పందిస్తూ మరోపక్క ప్రకృతిపై తనకున్న అభిప్రాయాలను తెలియజేస్తూ అదేవిధంగా పిల్లల గురించి వాళ్ళ టాలెంట్ గురించి తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటది. ఇదిలా ఉండగా రేణు దేశాయ్ తాజాగా తన ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.
పూర్తి విషయంలోకి వెళితే దాదాపు 17 సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ సినిమారంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆధ్య అనే లేడీ ఓరియంటెడ్ పవర్ ఫుల్ స్టోరీ కలిగిన సినిమాలో కీలకమైన క్యారెక్టర్ రేణు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేణు దేశాయ్ ఉదయాన్నే జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తూ…. తన శరీరాన్ని గతంలో మాదిరిగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో బరువు తగ్గే విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టిన రేణు దేశాయ్… జిమ్ లో ట్రైనర్ కు కనిపించకుండా… దాక్కుంటూ పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానిలో దమ్ముంటే నేను ఎక్కడ ఉన్నాను కనిపెట్టండి అంటూ… ఆ జిమ్ములో ఓ మూలకు డంబెల్స్ మధ్య దాక్కుని.. పట్టుకోండి చూద్దాం అంటూ సవాలు విసిరారు. ఆ విధంగా పిక్ పెట్టి కామెంట్ పెట్టారు రేణుదేశాయ్. ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?