Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ లేకపోతే వీడియో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ఈ క్రమంలో తాజాగా ఏకంగా ఒక పబ్లిక్ ఫంక్షన్ లో వేదికపై ఎమ్మెల్యే అంటూ ఆమె కామెంట్లు చేయడం తెలుగు మీడియా సర్కిల్స్ లో సంచలనం సృష్టించింది. మేటర్ లోకి వెళ్తే MSSO అనే ఆర్గనైజేషన్ అధినేత మైనంపల్లి రోహిత్ గురించి రేణుదేశాయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా ఈ ఆర్గనైజేషన్ ఆంబులెన్స్ సర్వీసులు ఫ్రీగా అందించడానికి రెడీ అవ్వడంతో ఆ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో జరిపించిన క్రమంలో .. ఈవెంట్ కి వచ్చిన ఆ రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేసింది. MSSO అనే ఆర్గనైజేషన్ అన్నదానం అదేవిధంగా రక్తదానం ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుస్తాయని కొనియాడారు. అతి చిన్న వయసులోనే ఆర్గనైజేషన్ అధినేత రోహిత్ ఈ స్థాయిలో రాణించటం నిజంగా గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఇలాంటి మంచి పనులు చేసే వ్యక్తులకు మరింత శక్తి దేవుడు ప్రసాదిస్తాడు అంటూ రేణుదేశాయ్ ఆర్గనైజేషన్ అధినేత రోహిత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో స్వీట్ చివరిలో స్టేజిపై అందరిముందు కాబోయే ఎమ్మెల్యే, మీ అందరి సపోర్ట్ రోహిత్ కి ఉండాలి అంటూ రేణు దేశాయ్ సరదాగా వ్యాఖ్యానించడం స్పీచ్ మొత్తానికి హైలెట్ అయ్యింది.