పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పిల్లలు అఖిరానందన్, ఆధ్య ని తీసుకుని పూణే లో ఉంటున్న సంగతి తెలిసిందే. టెలివిజన్ రంగంలో కొన్ని షోలకు జడ్జి గా వ్యవహరిస్తూ వచ్చిన రేణు దేశాయ్ నిర్మాతగా అదేవిధంగా డైరెక్టర్ గా కూడా ఇటీవల ప్రయోగాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఓ ప్రముఖ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో సోషల్ మీడియాలో వీడియో చాటింగ్ లో మాట్లాడుతూ.. చాన్స్ వస్తే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో కీలకమైన క్యారెక్టర్లు చేయడానికి ఓకే అని చెప్పడం కూడా తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇటీవల తెలుగు టాప్ యాంకర్ సుమ షో లో పాల్గొన్న రేణుదేశాయ్ పిల్లల గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నే రీతిలో భావోద్వేగానికి గురైంది. సుమా సొంత యూట్యూబ్ ఛానల్ “సుమక్క” లో రేణు దేశాయ్ ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఇష్టాయిష్టాలు గురించి మాట్లాడిన రేణు..పిల్లలు వాళ్ల నాన్న పవన్ తో కలసి షూటింగ్ ప్రదేశాలకు వెళ్లిన, లేకపోతే ఇంటిలో శుభకార్యాలకు వెళ్లినా అక్కడి నుండి తనకు వేరే వాళ్ళు ఫోన్ చేసే వాళ్ళని.. మీ పిల్లలు ఎంతో సరదాగా అందరితో కలిసి పోతున్నారు అని చెప్పినప్పుడు ఎంతో ఆనందంతో వేసేది అని తెలుపుతూ రేణు భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో తన షోలో పాల్గొన్నందుకు గాను సుమ “బెస్ట్ మామ్ఎవర్”అంటూ తన పిల్లలతో కలిసి దిగిన ఫోటో ఒకటీ కప్పు పై ముద్రించి రేణుదేశాయ్ కి గిఫ్ట్ గా అందించారు. రేణు దేశాయ్.. సుమ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.