NewsOrbit
జాతీయం న్యూస్

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

Lok Sabha Elections 2024: లోక్ సభ తొలి దశ ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న మణిపూర్ లోని 11 పోలింగ్ కేంద్రాల్లో ఇవేళ భారీ భద్రత చర్యల నడుమ రీపోలింగ్ ప్రారంభమైంది. ఇన్నర్ మణిపూర్ లోక్ సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది.

ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటలకు వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. మొయిరంగకంపు సాజేబ్ హయ్యర్ ప్రైమరీ స్కూల్, ఎస్ ఇబోబి ప్రైమరీ స్కూల్ (ఈస్ట్ వింగ్) ఛెత్రిగావ్ లోని నాలుగు పోలింగ్ స్టేషన్ లు, థోంగ్జులో ఒకటి, ఉరిపోక్ లో మూడు, కొంతౌజామ్ లో ఒక పోలింగ్ స్టేషన్ లో రీపోలింగ్ జరుగుతోంది.

ఈ నెల 19వ తేదీ తొలి పోలింగ్ జరుగుతున్న సమయంలో కొందరు దుండకులు కాల్పులు జరిపి ఈ వీఎంలను ధ్వంసం చేయడంతో ఈసీ ఈ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశాలు ఇచ్చింది. రీ పోలింగ్ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఔటర్ మణిపూర్ (ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోక్ సభ కు ఓటింగ్ జరుగుతోంది. ఔటర్ మణిపూర్ లోని మిగిలిన 13 ప్రాంతాలకు రెండో దశ ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 19 నుండి జూన్ 1వరకూ ఏడు దశల్లో 543 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, జూన్ 4న లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?