న్యూస్

Republic Day Celebrations: ఇక్కడ ఇలా..అక్కడ అలా..! కేసిఆర్ లెక్కే వేరప్ప..!!

Share

Republic Day Celebrations: భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం గవర్నర్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రితో సహా మంత్రులు, అధికారులు పాల్గొంటుంటారు. ఏపిలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జండా ఆవిష్కరించి ప్రజలకు సందేశం ఇవ్వగా సీఎం వైఎస్ జగన్ తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హజరైయ్యారు. తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా వేడుకలు జరిగాయి. కరోనా నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ తో సహా మంత్రులు ఎవ్వరూ హజరుకాలేదు. అధికారులతో కలిసి గవర్నర్ ఒక్కరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరో పక్క ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ జండా ఆవిష్కరించారు.

 

Republic Day Celebrations: సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళి సై వేరువేరుగా..

ఈ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ హజరు కాకపోవడం వల్లనో కానీ వేరే కారణం వల్లనో గానీ గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి ఊసు ఎత్తలేదు. కోవిడ్ ను అధిగమించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, హైదరాబాద్ లో ఐటి అభివృద్ధి వంటి వాటిపై ప్రసంగించారు. దీంతో సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళిసై మద్య గ్యాప్ బాగానే ఉందని టాక్ మొదలైంది.  ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పోరుబాట ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీఎం కేసిఆర్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరిగే రాజకీయ పోరాటాలకు గవర్నర్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు.

 

కేసిఆర్ సంప్రదాయాలను తుంగలో తొక్కారా..?

కానీ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం కేసిఆర్ హజరుకాకపోవడం రాజ్యాంగ విరద్దమంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సంప్రదాయాన్ని అనుసరించలేదని అంటున్నారు. కనీసం సీఎం ప్రతినిధిగా సీనియర్ మంత్రులను కూడా పంపకుండా గవర్నర్ ను అవమానించారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసిఆర్ సంప్రదాయాలను తుంగలో తొక్కారని ఈటల విమర్శించారు. రాజ్ భవన్ – ప్రగతి భవన్ కు మధ్య దూరం ప్రజలకు క్షేమం కాదనీ, ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసిఆర్ రాజ్ భవన్ కు వెళ్లలేదని అన్నారు ఈటల.


Share

Related posts

Weight Loss: నెగిటివ్ క్యాలరీస్ తో బరువు తగ్గండిలా..!!

bharani jella

Priyankagandhi Padayatra: దేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం కోసం.. ప్రియాంక గాంధీ మైండ్ బ్లోయింగ్ డెసిషన్..!!

sekhar

Bigg boss Harika : రోజురోజుకూ పెరిగిపోతున్న బిగ్ బాస్ హారిక గ్రాఫ్? ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ ఫాలోవర్స్?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar