NewsOrbit
జాతీయం న్యూస్

Republic Day : విదేశీ అతిథి లేకుండానే రిపబ్లిక్ డే వేడుకలు!ఎందుకిలా జరిగిందంటే!

Republic Day : గడిచిన 55 ఏండ్లలో విదేశీ అతిథి లేకుండా రిపబ్లిక్ డే పరేడ్ ఈ ఏడాది జరిగింది.గతంలో 1966లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌‌లో కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ లేరు.

Republic day celebrations without a foreign guest
Republic day celebrations without a foreign guest

ఆ ఏడాది జనవరి 11న తాష్కెంట్‌‌లో నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం, ఆ తర్వాత జనవరి 24న ఇందిరా గాంధీ ఆ పదవిలోకి రావడం లాంటి అనూహ్య పరిణామాలు జరిగాయి. దీంతో రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్‌‌ను పిలిచి, ఏర్పాట్లు చేసేందుకు సమయం లేకపోయింది. అయితే ఈ ఏడాది బ్రిటన్‌‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌‌ను గెస్ట్‌‌ ఆఫ్ ఆనర్‌‌‌‌గా ఆహ్వానించారు. అయితే ఆ దేశం నుంచే ప్రపంచమంతా కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి మొదలవడం, అక్కడ జులై వరకు లాక్‌‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఆయన రావడం లేదు. 1952, 1953లో కూడా ఇలా గెస్ట్ ఆఫ్ ఆనర్ లేకుండా రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌ జరిగింది.

Republic Day :జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన సాంప్రదాయమిది!

రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే మనం ఘనంగా జరుపుకొనే వేడుక రిపబ్లిక్‌‌ డే. మన చట్టాలు, మన పాలన, మన విధానాలు, మన శక్తి మీద నిలబడి పాలన చేయడం మొదలై భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఆ రోజును త్రివిధ దళాల పరేడ్‌‌తో సగర్వంగా జరుపుకొంటున్నాం. 1950 నుంచే రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్‌‌ ఆఫ్ ఆనర్‌‌‌‌ను ఆహ్వానించే ట్రెడిషన్‌‌ను దేశ తొలి ప్రధాని జవహర్‌‌‌‌లాల్‌‌ నెహ్రూ ప్రారంభించారు. తొలి రిపబ్లిక్ డే పరేడ్‌‌కు చీఫ్ గెస్ట్‌‌గా ఇండోనేషియా తొలి ప్రెసిడెంట్‌‌ సుకర్నో వచ్చారు. ఆ తర్వాతి ఏడాది 1951లో నేపాల్ రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ షా గెస్ట్ ఆఫ్ ఆనర్‌‌‌‌గా విచ్చేశారు. నాటి నుంచి ఈ విధానాన్ని ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొనసాగిస్తూ వస్తోంది. దీని ద్వారా దౌత్య సంబంధాలు పెంచుకోవడంతో పాటు విదేశాలతో పరస్పరం అనేక విధాలుగా రెండు వైపులా ప్రయోజనాలు కలుగుతున్నాయి.

Republic Day : ఇలా జరగడం ఇది నాలుగోసారి!

రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్ ఆఫ్ ఆనర్‌‌‌‌ లేకపోవడం ఈ ఏడాదే మొదటిసారి కాదు. గతంలో 1952, 1953, 1966 సంవత్సరాల్లో రిపబ్లిక్ డే వేడుకలు విదేశీ అతిథి లేకుండానే జరిగాయి. 1952లో దేశంలో తొలి జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న కారణంగా ఆ ఏడాది రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్ ఆఫ్ ఆనర్‌‌‌‌ను పిలవడం వీలు కాలేదు. అలాగే 1953లోనూ ఏ విదేశీ అతిథి లేకుండానే రిపబ్లిక్‌‌ డే వేడుకులు జరిగాయి. ఇక 1966 నాటి పరిస్థితులు అయితే పూర్తి భిన్నం. 1965లో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దాని ముగింపుపై 1965 జనవరి 10న రష్యాలోని తాష్కెంట్‌‌లో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం నాటి ప్రధాని లాల్‌‌బహదూర్ శాస్త్రి ఆ దేశానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాతి రోజే ఆయన మరణించారు. ఆ తర్వాత జనవరి 24న ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్‌‌ను పిలిచి, గ్రాండ్‌‌గా చేసే వీలు లేకపోవడంతో ఆ ఏడాది విదేశీ గెస్ట్‌‌ లేకుండా పరేడ్ ముగించారు. ఇవి మినహా ప్రతి ఏడాదీ గెస్ట్‌‌ ఆఫ్ ఆనర్ ఎదుట మన సైనిక శక్తి మొదలు, భిన్న సంప్రదాయాల వరకూ అన్నీ ఘనంగా ప్రదర్శిస్తూనే ఉన్నాం. మళ్లీ ఇప్పుడు కరోనా కారణంగా నాలుగోసారి గెస్ట్ లేకుండా రిపబ్లిక్‌‌ డే పరేడ్ జరుగబోతోంది. అయితే పోయిన ఏడాది కూడా గెస్ట్ విషయంలో  కిందా మీదా అయింది. మొదట అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌‌ను అతిథిగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించాలనుకుంది. కానీ ఆయన మన పిలుపును రిజెక్ట్‌‌ చేయడంతో భారత విదేశాంగ శాఖ  బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారోను ఇన్వైట్ చేసింది.

ఈ ఏడాది బోరిస్ జాన్సన్‌ను పిలిచినా కరోనాకారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆగిపోవాల్సి వచ్చింది.సొంత కాళ్లపై నిలబడి పరిపాలన చేసుకునే శక్తి వచ్చిన భారత్ గొప్పదనాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్‌‌ డే ఘనంగా నిర్వహించాలన్న ఐడియా స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూదే. విదేశీ అధినేతలను పిలిచి మన దేశ సైనిక శక్తితో పాటు, కల్చరల్ డైవర్సిటీ, రకరకాల నాగరికతలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించే వేదికగా ఈ వేడుకను ఆయన తీర్చిదిద్దారు. గెస్ట్‌‌ ఆఫ్  ఆనర్‌‌‌‌గా వచ్చే విదేశాధినేతనే రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు చీఫ్‌‌ గెస్ట్‌‌గా ట్రీట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు రాత్రి రాష్ట్రపతి భవన్‌‌లో మన ప్రెసిడెంట్‌‌ గెస్ట్ ఆఫ్ ఆనర్‌‌‌‌తో పాటు దేశంలో అన్ని రాజకీయ పక్షాల నేతలతో పాటు పలు రంగాల్లో గొప్ప వ్యక్తులను ఆహ్వానించి ఎట్ హోమ్ పేరుతో విందు ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా పెట్టారు. ఆ తర్వాతి రోజు మన ప్రధానమంత్రితో ఆ గెస్ట్ సమావేశమై ఇరు దేశాల సంబంధాలపై చర్చించి, ఆపై తన స్వదేశానికి పయనమవుతారు.ప్రత్యేక పరిస్థితుల్లో ఈసారి గెస్ట్ ఆఫ్ ఆనర్ లేకుండానే రిపబ్లిక్డే వేడుకలు ముగిశాయి.

 

author avatar
Yandamuri

Related posts

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju