NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

43 గంటల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం ..క్షేమంగా బయటపడిన యువకుడు

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లోలో అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 43 గంటల తర్వాత విజయవంతం అయ్యింది. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డాడు. దీంతో అధికారులు, యువకుడి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Rescue Team Safely pulled out Yourh Raju who fell into a cave in Kamareddy District

 

వివరాల్లోకి వెళితే ..కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం రెడ్డిపేట నుండి గన్ పూర తండ మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో షికారుకి వెళ్లాడు. షికారు చేస్తున్న సమయంలో రాళ్లపై వెళుతుండగా సెల్ ఫోన్ జారి కిందపడింది. ఆ పోన్ కోసం ప్రయత్నిస్తుండగా రాళ్ల మధ్యలో ఉన్న గుహలో రాజు పడిపోయాడు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అందులోనే ఉండిపోయాడు. అయితే చీకటిపడినప్పటికీ రాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి బుధవారం ఉదయమే అడవికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. రాళ్ల గుహలో నుండి రాజు అరుస్తుండటం గమనించి అటుగా వెళ్లి పరిశీలించగా రాజు గుహలో చిక్కుకుపోయిన ఉన్నాడు. రాజును బయటకు తీసే అవకాశం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

Man trapped in cave

అటవీ శాఖ, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని నిన్నటి నుండి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.  పోలీసులు జేసీబీని తెప్పించి జాగ్రత్తగా బండరాళ్లను ఒక్కటొక్కటిగా తొలగించారు. దాదాపు 43 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బండ రాళ్ల మధ్య పడిపోయి ఉన్న షాడ రాజును సురక్షితంగా బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన మండలంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజు కుటుంబ సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయి రాజు క్షేమంగా బయట పడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు 43 గంటలకు పైగా రాళ్ల మధ్య చిక్కుకుని ఉండటంతో ఆయనకు ప్రధమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.

కేసిఆర్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ .. తెలంగాణపై సుప్రీం కోర్టుకెక్కిన ఏపీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju