NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Anil Deshmukh : మహారాష్ట్ర హోంమంత్రి వ్యవహారాన్ని మమ అనిపించనున్నారా?మొక్కుబడి జుడీషియల్ విచారణకు సీఎం రెడీ!!

Anil Deshmukh : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ మీద వచ్చిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించుకుంది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ మీద చేసిన ఆరోణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించడానికి సీఎం ఉద్ధవ్ రెడీ అయ్యారు .ఈ విషయాన్ని స్వయంగా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదివారం వెల్లడించారు. ఇలా విచారణ జరిపించాలని తానే స్వయంగా సీఎం ఉద్ధవ్‌ను కోరినట్లు దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ విచారణతో నిజానిజాలు బయటికి వస్తాయని దేశ్‌ముఖ్ వ్యాఖ్యానించారు.

retired judge to probe allegations against me says anil deshmukh
retired judge to probe allegations against me says anil deshmukh

Anil Deshmukh సంచలనం రేపిన మాజీ సి.పిఆరోపణలు!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు నేపథ్యంలో.. ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. పరమ్‌బీర్‌ సింగ్‌ స్థానంలో హేమంత్‌ నగ్రాలేను ముంబై పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది.

ఈ నేపధ్యంలో హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ పరమ్​బీర్​ సింగ్​ సీఎం ఉద్దవ్ ఠాక్రేకి ఓ లేఖ రాశారు. నెలకు​ రూ.100 కోట్లు వసూలు చేసి తనకివ్వాలని ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన మాజీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్​ వాజేకు స్వయంగా హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఫిబ్రవరి మధ్యలో ఆదేశాలు జారీ చేశారని అన్నారు. బార్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూల్ చేయాలని చెప్పినట్లు ఆ లేఖలో సింగ్ తెలిపారు.

సుప్రీంకోర్టు తలుపు తట్టిన పరంబీర్ సింగ్!

మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మరో అడుగు ముందుకేశారు.ఇప్పటికే ఆయన మహారాష్ట్ర హోం మంత్రిపై సంచలన అవినీతి ఆరోపణలు చేయడం తో వెనక్కు తగ్గని సింగ్ తన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఎన్పీసీ నేత, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు పరమ్​బీర్​ సింగ్. హోంమంత్రిపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై పక్షపాతం లేని,ప్రభావితం కాని,నిస్పక్షపాతమైన,న్యాయబద్దమైన దర్యాప్తు చేయించాలని పరమ్ బీర్ సింగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

అంతేకాకుండా, ముంబై పోలీస్​ కమిషనర్​గా తనను తప్పించి… హోంగార్డ్​ విభాగానికి బదిలీ చేయడాన్ని కూడా సవాల్​ చేశారు పరమ్​బీర్. తనను బదిలీని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టివేయాలని సింగ్ పిటిషన్ లో కోరారు. తన బదిలీని ఏకపక్షమైనదే కాక అక్రమమైనదని పరమ్ బీర్ సింగ్ పేర్కొన్నారు.ఇన్ని పరిణామాలు చోటుచేసుకున్నాక
దాదాపు వారం గడిచిపోయాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో జుడీషియల్ విచారణ జరిపించడానికి సిద్ధపడటం విశేషం.

author avatar
Yandamuri

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju