గోపాల్ రామ్ అనే వ్యక్తికి మొన్న బుధవారం బీహర్ లోని నలంద జిల్లాలో పెళ్లి జరిగింది. పెళ్లికూతురితో సహా తాను ఆ రోజు సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. పెళ్ళికి ముందే గోపాల్ రామ్ కి ఇంకొక అమ్మాయితో ప్రేమ వ్యవహారం సాగింది. ఈ విషయం మొత్తం తెలుసుకున్న గోపాల్ రామ్ ప్రియురాలు అతని మీద కోపంతో రగిలిపోయింది. తనని మోసం చేసినందుకు అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నది.
ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గోపాల్ రామ్ ఇంటికి వెళ్ళింది. ఎంత వెతికినా గోపాల్ రామ్ కనిపించకపోవడంతో వెను తిరిగింది. అ సమయంలో అక్కడే నిద్రిస్తున్న పెళ్లి కూతురిని చూసింది.
ఆ కోపంలో వెళ్లి ఆమె జుట్టు కత్తిరించింది. ఈలోపు పెళ్లికూతురు కేకలు పెట్టడంతో ఆమె కళ్ళల్లో ఫెవికాల్ పోసింది ఆ ప్రియురాలు. వెంటనే బంధువులు ఆమె చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కొత్త పెళ్లికూతురు మరియు ప్రియురాలు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..