Review : రివ్యూ – ‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ హాఫ్

Review chaavu kaburu challaga
Share

Review : యంగ్ ప్రామిసింగ్ టాలెంట్ కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రంచావుకబురు చల్లగా‘. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మొదటిభాగం రిపోర్టు వచ్చేసింది. ఎలా ఉందో చూద్దాం

 

Review chaavu kaburu challaga
Review chaavu kaburu challaga

ఫస్ట్ హాఫ్ కథ :

ఇక మొదటి అర్ధభాగం కథలోనికి వస్తే…. హీరోకార్తికేయబస్తీ బాలరాజు గా కనిపిస్తాడు. ఊరిలో చనిపోయిన వారందరికీ అంత్యక్రియలు జరిపించే వ్యక్తి గా కనిపించే బాలరాజుహీరోయిన్ అయిన మల్లిక (లావణ్య త్రిపాఠి) మొగుడి అంత్యక్రియల్లో ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. మల్లిక అతనిని ప్రేమ ను పెద్దగా పట్టించుకోదు. మొగుడు చనిపోయిన వెంటనే వేరేవాడు వచ్చి ప్రపోజ్ చేయడం ఏంటి అని లైట్ తీసుకుంటుంది. కానీ బాలరాజు మాత్రం ఆమె వెంటపడుతూ ప్రేమించమని గొడవ చేస్తుంటాడు. ‘రంగస్థలంమహేష్ బాలరాజు పక్కనే అసిస్టెంట్ గా నటించాడు. మురళి శర్మ మల్లిక మామ గా కనిపిస్తాడు. ఈ మధ్యలో వచ్చే 2,3 సాంగ్స్ కూడా బాగున్నాయి. అయితే బాలరాజు మాత్రం ఇంటెర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఎదుర్కొంటాడు. దీంతో ఉండబట్టలేక మల్లిక ఇంటికి వెళ్తే పోలీసులు అతన్ని పట్టుకుని జైల్లో చావకొట్టేస్తారు. ఇక మల్లిక వెంట పడను అని చెబితేనే బయటికి వదులుతారు. అయినప్పటికీ బాలరాజు బయటికి వచ్చి మల్లిక వెనుక పడుతుంటాడు. అప్పుడు మల్లిక బాలరాజు తోనేను మెటర్నరీ వార్డులో నర్సుగా పనిచేస్తూ ఎంతో మందికి ప్రాణం పోస్తాను…. ఆ విలువ నాకు తెలుసు…. నువ్వు మాత్రం అంత్యక్రియలు జరిపిస్తావు. చావు పై కనీస సానుభూతి కూడా లేదునా భర్త శవం దగ్గర నాకు ప్రపోజ్ చేశావు…. మనిద్దరికీ సెట్ కాదు అని అంటుంది. ఇదే ఇంటర్వెల్ బ్లాక్.

Review : ఫస్ట్ హాఫ్ రివ్యూ:

  • కార్తికేయ యాక్టింగ్ చాలా చక్కగా చేశాడు. ఇలాంటి క్యారెక్టర్ ను అంత ఈజ్ తో చేయడం అనేది చిన్న విషయం కాదు. దీనికోసం తనలో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టేసాడు కార్తికేయ.
  • మొదటి అర్ధ భాగంలో వచ్చే మూడు పాటల చిత్రీకరణ చాలా బాగుంది. కార్తికేయ మంచి డాన్సర్ కాబట్టి ప్రేక్షకులకు ఈ మూడు పాటలు చూడముచ్చటగా ఉంటాయి. లావణ్య త్రిపాఠి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది.
  • ఇక మొదటి అర్ధ భాగంలో హీరో క్యారక్టరైజేషన్ పూరి సినిమాలో హీరో లాగా ఉంది. కథ నుండి పక్కకు వెళ్ళకుండా సినిమాను ఎక్కువగా కామెడీ మీదనే లాగేశారు. కార్తికేయ తన నటనతో మొదటి అర్ధభాగాని కి ప్రాణం పోసాడు. చక్కగా టైం పాస్ అయిపోతుంది.
  • అయితే మాలరాజు మల్లిక ను లవ్ చేయడం అనే లాజిక్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. అలా మొగుడు చనిపోయిన వెంటనే ఆమె వెంట పడి టీజ్ చేయడం కొంత మంది ప్రేక్షకులకి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. ఇదే పెద్ద నెగటివ్.

ఇక రెండవ అర్ధ భాగంలో బాలరాజు ఎలాగైనా మల్లికను ప్రేమలో పడేస్తాడా….. లేదా…? ఆమెను తనతో జీవితం పంచుకోవడానికి ఎలా ఒప్పిస్తాడు…? మధ్యలో ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు…? వాటిని అధిగమిస్తాడా…. లేదా అన్నది రెండో భాగం. ఈ భాగాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా, కన్విన్సింగ్ గా తీస్తే…. దాని మీద సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మొదటి అర్ధభాగం మాత్రం ఎబోవ్యావరేవ్ అని చెప్పవచ్చు.


Share

Related posts

బిగ్ బాస్ ఫోర్ : తన లాజిక్ తో సోహెల్ నోటి మాట రాకుండా చేసిన అభిజిత్..!!

sekhar

Purandeswari :పురంధేశ్వరి గారు క్లారిటీ ఇచ్చారా … క‌న్ఫ్యూజ్ చేశారా?

sridhar

బ్రేకింగ్: రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ కన్నుమూత

Vihari