రాఫెల్ పై తీర్పును పునస్సమీక్షించాలి!

రాఫెల్ ఒప్పందంపై తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ, దీనిపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలంటూ కేంద్ర మాజీ  మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా వారి పిటిషన్లను క కొట్టివేస్తూ గతనెలలో సుప్రీంకోర్టు  తీర్పు వెలువరించింది. రాఫెల్ ఒప్పందం విషయంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే సుప్రీం కోర్టు తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ వీరు మళ్లీ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

SHARE