న్యూస్

ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ? కేసీఆర్ కు షాక్ !

Share

తెగువ కలిగిన నేతగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కు ఆశాదీపం గా కనిపిస్తున్నాడు. టిడిపిలో చురుకైన పాత్ర పోషించి ఓటుకు నోటు కేసు అనంతరం

Rewanth Reddy as Chief Ministerial candidate Shock to KCR
Rewanth Reddy as Chief Ministerial candidate Shock to KCR

కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి అనతికాలంలోనే ఆ పార్టీ అగ్ర నాయకులలో ఒకరిగా ఉద్భవించాడు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా రేవంత్ గెలిచి హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ కి ప్రాణం పోశారు. ఎంపీ గెలిచిన అప్పటి నుంచి ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటపడుతున్నాడు.కేటీఆర్ ఫార్మ్ హౌస్ భాగో తాన్ని బయటకు తెచ్చాడు.కేసీఆర్ కి నిద్ర పట్టకుండా చేస్తున్నారు.గళమే రేవంత్రెడ్డి ఆయుధం.

అంతకుమించిన గట్స్ ఆయన సొంతం.రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీనీ ఎదుర్కొని కాంగ్రెస్‌ను మళ్ళీ అధికారంలోకి తేవాలంటే రేవంత్ రెడ్డి లాంటి గళమెత్తే నాయకత్వం కాంగ్రెస్‌కి కావాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఉధృతంగా సాగుతోంది.కాంగ్రెస్ అధినేత్రి సోనియా కూతురు ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఖాయం చేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకొస్తే సీఎం నువ్వేనని రేవంత్‌కి ఆమె భరోసా ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది.

Revanth Reddy calls KCR as Telangana's Dera Baba

అయితే ఇలా రేవంత్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నాడో లేక ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారో తెలీదు. పార్టీకాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంటే ఇక కాంగ్రెస్‌లో ప్రియాంక ముఖ్య భూమిక పోషించబోతోంది.
ఈ నేపధ్యంలోనే అన్ని రాష్ట్రాలలో ఇమేజ్ ఉన్న యువ నాయకులకు ఆమె కాంగ్రెస్ బాధ్యతలను అప్పచెప్పబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లను ప్రియయాంక గాంధీ పరిశీలిస్తున్నారని అయితే కోమటిరెడ్డికి సెంట్రల్‌లో అవకాశం కలిపించి, రేవంత్ రెడ్డికి రాష్ట్ర పీసీసీ అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.

కానీ సీనియర్లకు మాత్రం రేవంత్ పేరు అసలు మింగుడుపడడం లేదు.ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా మండిపడ్డారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి లాంటి నేతలను చూడలేదని, తాను కాబోయే సీఎం అంటూ అప్పుడే ప్రచారం మొదలుపెట్టాడని అన్నారు. ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలే పార్టీకి తెలంగాణలో శిలువ వేశారని ప్రియాంక గాంధీ ముందు ఈ విషయమై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు.


Share

Related posts

Rangamarthanda : రంగ మార్తాండ తో రాబోతున్న కృష్ణవంశీ..!

GRK

అమ్మాయి బాగుందని.. లక్షలు పెట్టాడు.. చివరికి?

Teja

Eetala Rajendar: తెలంగాణ కాంగ్రెస్ లో ఈటెల లొల్లి..! సొంత నియోజకవర్గంలోనే సమస్య మొదలు…!!

Yandamuri