అంకిత మహారాణ ని కాస్త అప్సర రాణి గా మార్చేశారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. థ్రిల్లర్ అన్న రొమాంటిక్ థ్రిల్లర్ తో తానే కొత్తగా పరిచయం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించాడు వర్మ. అయితే ఈ అమ్మాయి ని ఎక్కడో చూశామే అన్న నెటిజన్ అప్సర రాణి ఎవరో కనుక్కోవడానికి ఎంతో సేపు పట్టలేదు. అంతకు ముందు 4 లెటర్స్, ఊలాల్ల ఊలాల్ల సినిమాలు చేసింది అప్సర రాణి. ఆ సమయంలోనే ఆర్జీవీ ని కలవడంతో తనతో సినిమా చేయాలని ఫిక్సైయ్యాడు వర్మ. అలాగే థ్రిల్లర్ సినిమాతో తీసుకు వచ్చి విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేశాడు.
అప్సర రాణి ని చూస్తే నిజంగా యూత్ హాట్ బీట్ మారిపోతుంది. హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకునే టాలెంట్ కూడా ఉంది. అయితే అప్సర రాణి కి మాస్ మహారాజ రవితేజ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ క్రాక్ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్ గా కంప్లీటయింది. అయితే గత నెలలో అప్సర రాణి రవితేజ తో కలిసి సాంగ్ చేస్తున్నట్టు లొకేషన్ లో పిక్స్ ని షేర్ చేశారు. పిక్స్ కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
కాని తాజాగా ఈ సినిమా నుంచి బూమ్ బద్దల్ అన్న లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ చూసిన ప్రతీ ఒక్కరు షాకవుతున్నారు. ఈ సాంగ్ లో అప్సర డాన్స్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్ మతిపోగొడుతుంది. డాన్స్ పరంగా అప్సర అధ్బుతంగా చేసింది. ఖచ్చితంగా ఈ సాంగ్ కి రేపు థియోటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు. అసలే మాస్ రాజ .. ఆ మాస్ రాజా పక్కన అప్సర రాణి … కిక్ ఇచ్చే మాస్ సాంగ్ .. ఇక ఊహించుకంటే ఎప్పుడెప్పుడు థియోటర్స్ లో ఈ సాంగ్ చూడాలా అన్న ఆతృత ప్రేక్షకులకి కలుగుతోంది. ఈ సాంగ్ హిట్ అయితే ఇక అప్సర రాణి కి టాలీవుడ్ లో గ్యారెంటీగా మరికొన్ని సాంగ్స్ లో చేసే ఛాన్స్ వస్తుందన్న నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక రవితేజ కి ఈసారి క్రాక్ పెద్ద హిట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.