RGV: మీకు మీ డ్రైవర్ కి తేడా లేదా? జగన్ ని నిలదీసిన RGV!

Share

RGV:ఇకపోతే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో సందడి చేస్తున్న సినిమా టికెట్ల వ్యవహారం గురించి అందరికీ విదితమే. తాజాగా ఈ విషయమై ప్రముఖ వివాదాల దర్శకుడు అయినటువంటి వర్మ ఏపీ సర్కారుకి సూటిగా ట్వీట్ల రూపంలో మరియు వీడియోల రూపంలో తన ప్రశ్నల అస్త్రాలను సంధించారు. దాంతో ఈ మేటర్ ఇంకా హీటెక్కింది. ఇటు ప్రభుత్వానికి, అటు రామ్‌గోపాల్‌ వర్మకి మధ్య వివాదం రోజురోజుకీ రాజుకుంటోంది. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఆర్జీవీ నిలదీస్తుంటే… దానికి కౌంటర్ గా మంత్రి పేర్ని నాని స్పందిస్తున్నారు.

RGV: ఏపీ గవర్నమెంట్ ని ప్రశ్నించిన RGV, దీనికి చిరు రియాక్షన్ కేక!!

RGV: ఇంతకీ వర్మ అడుగుతున్నదేంటి?

గత మూడు రోజులుగా ఈ తతంగం నడుస్తోంది. నిన్న RGV అడిగిన ప్రశ్నలకు ఈరోజు మంత్రి పేర్ని నాని స్పందించడం కొసమెరుపు. ఈరోజు వరకు వారు చూడలేదా లేక ఎదురు కౌంటర్ ఏమి అడగాలో తెలియని డైలమాలో ఈరోజు స్పందించారో గాని, బాగానే రెస్పాండ్ అయ్యారు. అయితే దానికి మన RGV తక్కువ తిన్నాడా ఏమిటి? అంతకంటే ధీటుగా స్పందిస్తూ… ట్వీట్లు చేస్తున్నాడు. దాంతో ఈ వ్యవహారం నేడు టామ్ అండ్ జర్రీ మాదిరి తయారయ్యిందని చెప్పుకోవాలి. ఓవైపు ఈ విషయం RGV అభిమానులు మాత్రం మంచి
ఖుషిగా వున్నారు.

AP Employees JAC: రేపు సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ..? సంక్రాంతికి గుడ్ న్యూస్ ఖాయమే..!!
వర్మ vs నాని మాటలను ఓ సారి చదివేయండి..

నిన్న వర్మ అడిగిన 10 ప్రశ్నలకు మంత్రి నాని తనదైన స్టైల్ లో స్పందించారు. “రూ.100 టికెట్‌ను రూ.వెయ్యికి, రూ.2 వేలకి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ అండ్ సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.” అని ఓ ఎదురు ప్రశ్న వేశారు. దీనికి వర్మ కౌంటర్‌ ఏమంటే “నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?” అని అడిగేసరికి మంత్రి నానికి ఏమి సమాధానం ఇవ్వాలో బోధపడలేదు.


Share

Related posts

Bank Loan: బ్యాంక్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్ చెల్లించనవసరం లేదా..!? చట్టాల్లో ఏముంది..!?

bharani jella

Rechipodam Brother : అదిరిపోయిన రెచ్చిపోదాం బ్రదర్ ప్రోమో.. జబర్దస్త్ కు మించిన కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఇది?

Varun G

మహేష్ బాబు భార్య ఎలా నిద్రపోతుందో చూశారా?

Teja