Breaking: రామ్ గోపాల్ వర్మ (ram Gopal Varma).. ఎప్పుడు వివాదాలకు ఈ పేరు కేరాఫ్.. ఇష్టమోచ్చినట్టు ట్వీట్లు చేస్తూ.. వివాదాలతో కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ ఉంటాడు. మొదట్లో మంచి కథలతో సినిమాలు అందించిన ఈ డైరెక్టర్.. ఇటీవలి కాలంలో రాజకీయాల్లోని విషయాలపై ఫోకస్ పెట్టి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. మొన్నటికి మొన్న సీనియర్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తీసి వివాదాల్లో నిలిచాడు. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదట్లో బ్యాన్ చేశారు. రక్తచరిత్ర సినిమాను రెండు పార్టులుగా తీశారు.
RGV: రామ్ గోపాల్ వర్మ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ బ్యూటీ..!!
తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతూ..
ఇప్పటి వరకు సినిమాల పరంగా ఏపీ రాజకీయాలకే పరిమితమైన ఆర్జీవీ.. తాజాగా తెలంగాణ రాజకీయాల్లోనూ వేలు పెడుతున్నాడు. తెలంగాణ పాలిటిక్స్, మావోయిస్టులపై మూవీ తీస్తానంటూ.. కొండా సురేఖ దంపతుల బయోపిక్‌ను ప్రకటించాడు. దీనికి ‘కొండా’ అనే టైటిల్‌ను సైతం ఖరారు చేసి ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు ఈ వివాదాల డైరెక్టర్. మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై (Etala ragendar) మూవీ తీస్తున్నానంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఈ మధ్యే ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీలో చేరిన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఒక పక్క రాష్ట్రం మొత్తం ఈ ఉప ఎన్నికపైనే ఉత్కంఠకు లోనవుతుంటే.. ఈటలపై సినిమా తీస్తానంటూ ఆర్జీవీ ఒక్క సారిగా అందరికీ షాక్ ఇచ్చాడు.
RGV: రామ్ గోపాల్ వర్మ ‘ హాట్’ డ్యాన్స్ వీడియో మీద స్పందించిన శ్రీకాంత్ అయ్యంగార్ ” ఆ రోజు రాత్రి ” అంటూ
వెన్నుపోటు ఈటలు అంటూ పోస్టర్ ట్వీట్
ఈటల రాజేందర్ పై తీయబోతున్న సినిమాకు సంబంధించి ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టాడు.నాకు ఎందుకో కేసీఆర్‌కు (kcr) ఈటల రాజేందర్ వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్, సీనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటూ ఒకేరకంగా అనిపించింది. అందువల్లే కేసీఆర్‌కు ఈటల రాజేందర్ పొడిచిన వెన్నుపోటును గురించి తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ మేధావులతో చర్చించి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇందుకు ‘వెన్నుపోటు’ అని టైటిల్ పెట్టి కింద ‘ఈటలు’ అని మెన్షన్ చేసిన పోస్టర్‌ను సైతం ట్విట్టర్లో పెట్టాడు. అనంతరం కొద్ది సేపటికే ఆ ట్వీట్‌ను రామ్ గోపాల్ వర్మ తొలగించారు.
KCR: వెంకయ్యనాయుడు కుర్చీలో కేసీఆర్..? బీజేపీ ప్రతిపాదనకు కేసిఆర్ సమాధానమేమిటంటే..?