కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య చాలా వరకు సైలెంట్ అయిపోయారు. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో రామ్ గోపాల్ వర్మ డిజిటల్ తరహాలో సినిమాలు చేసి భారీ స్థాయిలో లాభాలు సాధించారు. మసాల సినిమాలతో పాటు కొన్ని కాంట్రవర్సి సినిమాలు చేసి అతి తక్కువ బడ్జెట్ తోనే రికార్డు స్థాయి లాభాలు ఆర్జీవి సాధించినట్లు వార్తలు రావటం జరిగాయి.
ఇదిలా ఉండగా ఇటీవల ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఆర్జీవి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ స్వింగ్ లో టాప్ కంటెస్టెంట్ గా రాణిస్తున్న అరియనా గురించి ఆర్జీవికి ప్రశ్న వేసింది. ఆమె మీతో ఇంటర్వ్యూ చేశాక బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినట్లు యాంకర్ కామెంట్ చేసింది. అయితే టాప్ ఫైవ్ లోకి అరియనా వెళ్లే అవకాశం ఉండటంతో.. మీరు ఏమైనా చెబుతారా అంటూ ఆర్జీవీ ని యాంకర్ ప్రశ్నించింది.
అయితే తాను బిగ్ బాస్ షో చూడనని ఆర్జీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో హౌస్ లో ఎంతమంది ఉంటారని యాంకర్ ని ఆర్జివి ప్రశ్నించగా 16 మంది వెళ్తే టాప్ ఫైవ్ లో కి కొంతమంది వెళ్తారని వారి టైటిల్ ఒక్కరే గెలుస్తారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆర్జీవి.. అరియనా గురించి మాట్లాడుతూ తాను అప్పట్లో ప్రశ్నించిన సమయంలో నేను బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చినా గాని ఆమె తీసుకోవటం చాలా గ్రేట్ అని మెచ్యూర్ మైండ్ సెట్ కలిగిన అమ్మాయి అంటూ ఆమె గెలిస్తే సంతోషిస్తా అన్న తరహాలో రామ్ గోపాల్ వర్మ తాజా ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.