Rain Water: రోడ్డు మీద నిలిచి ఉన్న వాన నీటిలో బైక్ వేసుకుని వెళ్తున్నారా?

Share

Rain Water: వర్షాకాలం లో సహజం గానే   రోడ్డు బుర‌ద‌గా ఉండడం తో పాటు , నీటితో నిండి ప్రయాణానికి ఇబ్బందిగా ఉంటుంది.  ఇలాంటి సమయాలలో వాహనదారులు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో  తెలుసుకుందాం. ముందుగా  మీ  బైక్ బ్రేక్ లు టైర్లు,   కండిష‌న్‌లో ఉన్నాయో లేవో చెక్  చేసుకోవడం తో పాటు బండిలో ఇంజిన్ ఆయిల్ త‌గినంత ఉందో లేదో  కూడా చెక్ చేసుకోవాలి .     వర్షానికి తడిస్తే ఇవి సరిగ్గా పని చేయవు. క‌న్సీల్డ్ కానీ వైర్లు షార్ట్ స‌ర్క్యూట్‌కు  కారణం కావచ్చు. ఇది బైకుతోపాటూ వాహనదారులకు కూడా  ప్రమాదం అని చెప్పాలి. అలాగే  బైక్ చైన్ పనితీరు  బాగుండేలా చూసుకోవాలి . చైన్ సరిగా తిరిగేందుకు అవ‌స‌ర‌మైన ఆయిల్‌తో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దీంతో పాటు బైక్ న‌డిపేట‌ప్ప‌డు హెల్మెట్, ఇత‌ర ర‌క్ష‌ణ వస్తువులు కూడా ధరించండి. వాన నీటికి  పొర‌పాటున బండి ఎక్క‌డైనా స్కిడ్ అయినా.. మీకు ఎటువంటి దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా ఇవి  రక్షణ కల్పిస్తాయి. బయట నుంచి ఇంటికి తిరిగొచ్చాక బైక్ చైన్‌కుకాస్త  ఆయిల్  రాస్తూ ఉండండి.

Px006-013
KARACHI: Aug06 – Man seen pushing his malfunctioned motorcycle as he wades throuhg a road after heavy monsoon rain which lashed the port city where motorists faced hardships due to accumulation of rainwater on roads in several areas.
ONLINE PHOTO by Sabir Mazhar

వర్షా కాలంలో బండి మీద వెళ్ళ‌డానికి     ప్రయాణించే  రోడ్డు అనుకూలంగా  ఉందో లేదో గమనించుకుంటూ ఉండాలి. నీటితో నిండిన రోడ్ల‌పై వెళ్ళాల‌నుకునే బైక‌ర్స్ ముందుగా ఆ రోడ్డుపై ఉన్న నీటి లోతును అంచ‌నా వేసుకోవాలి. బండి నీళ్ళ‌ లో కి వెళ్ళినప్పుడు  బైక్ బాష్ గార్డ్‌ క‌న్నా త‌క్కువ ఉంటేనే ఆ ఆ నీటి రోడ్డులో  ప్ర‌యాణించాలి. ఒక వేళ మీరు నీటిలోతు అంచ‌నా వేయ‌లేక‌పోతేమాత్రం కాస్త  దూర‌మైనా కూడా మ‌రో దారి  లో వెళ్లడం మంచిది. అలాగే కొత్త దారిలో  వెళ్లేవారు నీళ్లు ఉన్న రోడ్డుమీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.  ఎక్కడ ఏ  గొయ్య ఉంటుందో మీకు తెలియదు కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. అలాగే మ‌న ముందువెళ్లే వాహనం  కి  త‌గినంత గ్యాప్ మెయింటైన్  చేస్తూ వెళ్లడం మంచిది.

ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా  ఒక్కోసారి మోటారుసైకిల్ మొరాయించి కదలకపోవచ్చు. అలాంటి  సమయంలో  కంగారు పడకుండా  బండిని ఓ ప‌క్క‌న పార్క్ చేసి,ద‌గ్గ‌ర్లో మెకానిక్‌లు ఉంటే తీసుకురావాలి. లేదంటే షోరూమ్ స‌ర్వీస్ సెంట‌ర్ వారికి కాల్‌చేసి బండి  ఎక్కడ ఉందో  తెలియచేయాలి. ఒక వేళా నీళ్ళ‌లో బండి  ఆగిపోతే దాన్ని అదేప‌నిగా స్టార్ట్ చేయ‌డానికి ట్రై చేయకూడదు. అలా చేయడం వలన ఒక్కోసారి ఇంజిన్‌లోకి నీరు  చేరవచ్చు,లేదంటే బండిలోని సున్నిత‌మైన ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు పాడవుతాయి.  అలాంటప్పుడు  బండిని పదే ,పడే  స్టార్ట్ చేయ‌కుండా మెకానిక్ కు  చూపించడం మంచిది.


Share

Related posts

SLEEPING TIPS: చక్కటి నిద్ర కోసం ఈ టిప్స్ ఫాలో అవుతే సరి…!

Ram

మంచి స్పీడ్ మీద ఉన్న పవన్ కళ్యాణ్..!!

sekhar

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ కార్తీక దీపం సీరియల్ లో గెస్ట్ రోల్???

Naina