23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

Breaking: బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రిషి సునాక్ .. నామినేషన్ ఉపసంహరించుకున్న పెన్నీ మోర్డాంట్

Rishi Sunak బ్రిటన్ లో నవ యుగం ఆరంభం
Share

Breaking: భారత సంతతికి చెందిన బ్రిటన్ కన్జర్వేటివ్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికైయ్యారు. బ్రిటన్ పార్లమెంట్ లో అధికార కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల సంఖ్య 357 కాగా రిషి సునాక్ కు 188 మంది సభ్యులు మద్దతు ప్రకటించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో పాటు యూకే హౌస్ ఆఫ్ కామర్స్ నాయకురాలు పెన్నీ మోర్డాంట్ అవసరమైన సభ్యుల మద్దతు లేకపోవడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో రుషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైయారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

Rishi Sunak బ్రిటన్ లో నవ యుగం ఆరంభం
Rishi Sunak:

 

బోరిస్ జన్సన్ రాజీనామాతో ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ 45 రోజుల వ్యవధిలోనే పదవి నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్రిటన్ లో మరల రాజకీయ సంక్షోభం నెలకొంది. లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ మరో సారి పోటీకి రెడి అయ్యారు. విహార యాత్రలో ఉన్న బోరిస్ హుటాహుటిన లండన్ కు చేరుకుని పావులు కదిపారు. దాదాపు వంద మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. దాంతో పోటీ లేకుండా ప్రధాని అయ్యేందుకు ఆయన రిషి సునాక్, పెన్సీ మెర్డాంట్ తో చర్చలు జరిపారు. పోటీ లేకుండా అయినా తాను నామినేషన్ దాఖలు చేస్తానన్న బోరిస్ ప్రతిపాదనకు వారు అంగీకరించలేదు. పోటీ నుండి వైతొలగమని చెప్పారు. పోటీ జరిగితే గెలుపు అవకాశాలు ఉండవని భావించిన బోరిస్.. ప్రధాని రేసు నుండి తప్పుకుంటున్నట్లు ఈ ఉదయం ప్రకటించారు.

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కిస్తానని, కన్వర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహిస్తానని రుషి సునాక్ తెలిపారు. దేశం కోసం గతంలో తాను ఎంతో కష్టపడ్డాననీ కోవిడ్ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించానని, తన సేవలకు గుర్తించి అవకాశం ఇవ్వాలని ఆయన సభ్యులను కోరగా మెజార్టీ సభ్యులు మద్దతు తెలియజేశారు.

రిషి సునాక్ వయస్సు 42 సంవత్సరాలు. ఆయన ఇంగ్లాండ్ సౌతాంఫ్టస్ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్ కు వలస వెళ్లారు. తండ్రి యశీవీల్, తల్లి ఉషా సునాక్. తండ్రి కెన్యాలో పుట్టి పెరిగారు. తల్లి టాంజానియాలో పుట్టి పెరిగారు. ఆమె తల్లి పూర్వికులు పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వారు. రిషి సునాక్ వించెస్టర్ కాలేజీలో చదువుకున్నారు. ఆక్స్ ఫర్డ్, లింకన్ కాలేజీలో పిలాసఫీ, పాలిటిక్స్, ఎకానమిక్స్ చదివారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఆయన ఎంబీఏ పూర్తి చేశారు. భారత ఐటీ దిగ్గజ సంస్థ ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షితా మూర్తిని 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్. గత ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన రుషి సునాక్ హిందూ మత విశ్వాసాలను గౌరవిస్తారు. నాడు మంత్రిగా భగద్గీతపై ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం పట్ల ఇక్కడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.


Share

Related posts

15600 అడుగుల ఎత్తులో అరుణాచల్ సిఎం రైడ్

somaraju sharma

Araku: మాజీ మంత్రికి హ్యాండ్ ఇస్తున్న చంద్రబాబు..!? అరకు సీటు దొరకే..!?

somaraju sharma

Minister Balineni: వైసీపీలో కాక.. పేషీలో పేచీ..! మంత్రిగారి ప్రైవేట్ రష్యా పర్యటన సీక్రెట్లు ఇవీ..!!

Srinivas Manem