NewsOrbit
న్యూస్

RRR: ఆర్ ఆర్ ఆర్ కు పెరుగుతున్న చిక్కులు!చరిత్రను వక్రీకరించారంటూ హైకోర్టు కెక్కిన అల్లూరి యువజన సంఘం!!

RRR: విడుదల ఆలస్యమయ్యే కొద్దీ దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి కొత్త కొత్త సమస్యలుపుట్టుకొస్తున్నాయి.తాజాగా ఈ చిత్ర కథాంశం పై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

Rising implications for RRR!
Rising implications for RRR

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మ్యాజిక్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి రూపొందించటం తెలిసిందే.ఎప్పుడో చిత్రం విడుదలకు సిద్దమైనా అనుకోని అవాంతరాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.నిజానికి ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఆ చిత్రం నిలవాల్సి ఉంది.అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు,ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లపై ఏర్పడ్డ వివాదం తరతరాల దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ఈ సినిమా విడుదలను నిరవధికంగా వాయిదా వేశారు.పరిస్థితులు అన్నీ అనుకూలించాకే ఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమాను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొన్న పంపిణీదారులు సినిమా విడుదల లో జాప్యం జరుగుతుండడం పై చిందులు తొక్కుతూ ఉండడమేకాక రాజమౌళిని కూడా నిలదీస్తున్నట్టు సమాచారం.వ్యవహారం కోర్టు దాకా కూడా వెళ్లింది.ఈ వివాదాన్ని పక్కన బెడితే సోమవారం ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఇంకో సమస్య ఎదురైంది.

చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ పిటిషన్

ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పటికీ కలవని ఇద్దరూ వీరుల మధ్య స్నేహాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా ఎన్టీఆర్ గిరిజన వీరుడుకొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.ఈ కథాంశాన్ని వ్యతిరేకిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని పేర్కొంటూ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

ఆ సంఘం వాదన ఏమిటంటే!

అసలు అల్లూరి, కొమురం భీమ్ లు కలిసినట్టు చరిత్రలో లేదన్నారు.పైగా బ్రిటిష్ వారిని ఎదిరించి తిరుగుబాటు చేసిన అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ పోలీస్ గా ఆర్ ఆర్ ఆర్ లో చూపించటం దారుణమని కూడా ఆ పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు.ఆసక్తికరమైన సినిమా కథాంశం కోసం చరిత్రను వక్రీకరించడం తగదని ఆ సంఘం రిట్ పిటిషన్ లో పేర్కొంది ఇప్పటికైనా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలని సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు డిమాండ్ చేశారు.మరి హైకోర్టు ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!