అతి వృష్టి … అప్రమత్తం.

 

 

చుట్టు ప్రక్కల కురుస్తున్న వర్షాలతో కొండవీటి వాగులోకి వరద నీరు ఎక్కువగా చేరుతుంది. దీంతో కొండవీటి వాగులో ప్రవహిస్తున్న వరద నీటిని ఎత్తపోతల పథకం మోటర్ల ద్వారా నీటిని కృష్ణా నదిలోకి  పంపింగ్ ద్వారా వదులుతున్నారు. ఇప్పటికి ఐదు మోటర్ల ద్వారా వాగులోని నీటిని అధికారులు నదిలోకి పంపుతున్నారు. మిగిలిన మోటర్లు కూడా వదిలితే పంట పోలాలలోకి నీరు అసలు రాదని రైతులు తెలియజేస్తున్నారు.

విశ్రాంతి లేకుండా ఎగువున కురుస్తున్న వర్షాలతో నలుదిక్కుల నుండి కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది.  వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండ లా మారింది. దీంతో అధికారులు అప్రమత్తం అయి ప్రాజెక్టు పది గేట్ల ను 20 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.  జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులు ఉంది.  ఇన్ ఫ్లో 4,90,469 క్యూసెక్కుల నీరు కాగా 5,05,199 క్యూసెక్కుల నీటిని  దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది.  నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

సాగర్ నుంచి… నీటిని వదిలిన అధికారులు

శ్రీశైలం పది గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని క్రందకి వదులుతున్నారు. ఆ వరద నీరు సాగర్ జలాశాయానికి వచ్చి చెరుతుంది దీంతో అంతే మొత్తంలో అధికారులు నీటిని దిగువకు ప్రవహింపజేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 310.25 టీఎంసీ లగా ఉంది. అదే విధంగా పులిచింతల జలాశయం నీటి సామర్ధ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 41. 58 టీఎంసీ లు ఉంది. 415,641 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్ లోకి రాగా 578,002 క్యూసెక్కుల నీటిని క్రిందకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం ఎక్కువ అవడంతో గత కొద్ది రోజులుగా అన్ని గేట్లు ఎత్తి వేశారు.