Acharya: మెగాస్టార్ “ఆచార్య”పాట పై ఆందోళన బాట పట్టిన ఆర్ఎంపీలు!ఆదిలోనే కొత్త వివాదం మొదలైందిగా?

Share

Acharya: సినిమాల్లోని పాటలు, టైటిళ్లు,పాత్రలపై వివాదాలు చెలరేగడం పరిపాటిగా మారింది.గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో ఈమధ్య రూపొందిన నయీమ్ డైరీస్ అనే సినిమాలో తెలంగాణ గానకోకిలగా పేరొందిన బెల్లిలలిత పాత్రకు లిప్ లాక్ సీన్ పెట్టి అసభ్యంగా చిత్రీకరించారని ఆమె కుటుంబ సభ్యులు,తెలంగాణ ప్రజా సంఘాలు పై కోర్టుకు వెళ్లడంతో ఆ చిత్ర ప్రదర్శనను నిలిపి వేయటం తెలిసిందే.అలాగే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పులి సినిమాకు “కొమరం పులి” అని పేరు పెట్టగా దాని పైనా వివాదం తలెత్తి చివరకు ఒట్టి “పులి”గానే ఆ సినిమా విడుదలయింది.

RMPs worried about megastar "Acharya" song!
RMPs worried about megastar “Acharya” song!

రైల్వే శాఖే అభ్యంతరం తెలిపిన పాటొకటుంది!

ఇక సినిమా పాటల విషయానికొస్తే అనేక వివాదాలు పుట్టుకొచ్చాయి. పాటల విషయంలో చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్న ఘటన జరిగింది.తేజ “జయం” సినిమాలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి అన్న ఉద్దేశ్యంతో ఒక పాటను చిత్రీకరించి విడుదల చేయగా రైల్వే శాఖ అభ్యంతరం తెలపడంతో ఆ పాటను పూర్తిగా మార్చేసి రైళ్లను కీర్తిస్తూ పాటను రాయించి ఆ సినిమాలో చేర్చారు.అలాగే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మగధీర లో వంగపండు ప్రసాద రావు రాసిన ఎం పిల్లో ..ఏడకొస్తావా అన్న పాట అన్న పాటను ఆయన అనుమతి లేకుండా వాడుకున్నారని గొడవ జరగ్గా తర్వాత సినిమా యూనిట్ ఆ విషయాన్ని సెటిల్ చేసుకుంది.

Acharya: ఆర్ఎంపీలను హర్ట్ చేసిన “ఆచార్య” పాట!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాం చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న”ఆచార్య” సినిమాలోని ఒక పాట పై వివాదం చెలరేగింది.ప్రప్రథమంగా ప్రకాశం జిల్లా నుండి ఆ పాటకు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపించాయి.తమను కించపరిచారని ఇంకొల్లు ఆర్ఎంపీలు గొంతు విప్పారు.

Acharya: ఆ పాటలో ఏముందంటే?

ఆచార్య సినిమాలోని ఒక పాటను శుక్రవారమే విడుదల చేశారు.దానికి మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలో అందులోని ఒక చరణం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ పాటలో ” స్త్రీని ఏడాడో నిమరొచ్చొని కుర్రోళ్లు ఆర్ఎంపీల యిపోతున్నారు” అని ఒక చరణం ఉందని ఇంకొల్లు మండలం హెల్త్ ఫస్ట్ఎయిడర్ల సంక్షేమ సంఘం తెలిపింది.

ఆర్ఎంపీలు ఏమంటున్నారంటే?

ఇది ఆర్ఎంపీల మీద మీద ప్రజలకు దురభిప్రాయం కలిగించే చరణమని,తమ వృత్తి మీద కూడా దుష్ప్రభావాలు కలిగే ప్రమాదముందని సంఘం అధ్యక్షుడు రావినూతల శ్రీనివాసరావు తెలిపారు .తాము కూడా సీనియర్ వైద్యుల వద్ద శిక్షణ పొందాకే సొంతంగా వైద్యం చేస్తామని, ఆషామాషీగా చేసే వృత్తి ఇది కాదన్నారు.ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో తాము బాధ్యతగానే వ్యవహరిస్తామన్నారు.అయితే తమను చిన్నచూపు చూసేలా, తమ వృత్తిని కించపరిచేలా ఉన్న ఈ చరణాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఇంకొల్లు తహసీల్దార్ కు వినతపత్రం కూడా సమర్పించింది.ప్రస్తుతానికి ఈ నిరసన ప్రకాశం జిల్లాకే పరిమితమైనా రానున్న రోజుల్లో రాష్ట్రమంతా వ్యాపించే అవకాశం లేకపోలేదు.

 


Share

Related posts

కాటన్ బడ్స్ ఎందుకు ప్రమాదకరమో తెలుసుకోండి!!

Kumar

Sonu Sood: 22 మంది ప్రాణాలను కాపాడిన సోనూసూద్..!!

sekhar

PM Modi: బిగ్ బ్రేకింగ్ ..దేశంలో లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోడీ

somaraju sharma