కమ్మేసిన మంచు- ఏడుగురు మృతి

హర్యానాను మంచు కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా దారి కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉదయం పది గంటల సమయంలో కూడా అంబాలాలో హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నా ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది.

మంచు కారణంగా రెండు ఎస్ యువి(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) ఢీ కొన్న ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చండీగఢ్ నుంచి అంబాలా వైపు వస్తున్న ఈ వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా దారి సరిగా కనిపించకే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

SHARE