RRR: “ఆర్ఆర్ఆర్” సినిమా నుండి బిగ్ అప్డేట్..!!

Share

RRR: “ఆర్ఆర్ఆర్” సినిమాకి సంబంధించి షూటింగ్ క్లైమాక్స్ కి  చేరుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత.. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి వార్త అయినా ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ గా మారుతూ ఉండటం మాత్రమే కాక అనేక రికార్డులు సృష్టిస్తూ ఉన్నాయి. చరణ్, ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన టీజర్ లు.. ఇప్పటికే నందమూరి మెగా అభిమానులకు ఉర్రూతలూగేలా చేస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌ రెడీ చేసింది సినిమా యూనిట్. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నెల 15 వ తారీకు ఉదయం 11 గంటలకు ‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలు ఈ వీడియోలో బంధించినట్టు దీని .. రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Read More: Narappa Trailer Review: విక్టరీ వెంకటేష్ “నారప్ప” ట్రైలర్ రివ్యూ..!!

దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 13వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. చరణ్, ఎన్టీఆర్ ల తో పాటు హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోంది. అంత మాత్రమే కాక అజయ్ దేవగన్ శ్రేయ కూడా కీలక పాత్ర లో నటిస్తున్నారు. దాదాపు ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఆ సాంగ్ యూరప్ లో చిత్రీకరించనున్నట్లు ఈ సాంగ్ లో హీరో హీరోయిన్లు మొత్తం నలుగురు పాల్గొననున్నట్లు సమాచారం. 


Share

Related posts

Alzheimer’s: ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పొతే  పూర్తిగా  జ్ఞాపక శక్తి పోవడం ఖాయం!!

Kumar

వహ్వా..! ఆ పత్రికకు కలెక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు..!

Muraliak

MP Komatireddy: కాంగ్రేస్ ఎంపి కోమటిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు..?

somaraju sharma