సుడిగాలి సుధీర్ ను మల్లు అంకుల్ అంటూ అందరి ముందు పరువు తీసేసిన రాకింగ్ రాకేశ్

సుడిగాలి సుధీర్ కు ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుధీర్ అంటే ఇప్పుడు ఓ బ్రాండ్. ఆయన ఏ షోలో ఉంటే ఆ షో సక్సెసే. సుధీర్ తో పాటు రష్మీ కూడా ఉంటే ఆ జంటకు ఉన్న క్రేజే వేరు. వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీయే వేరు. అందుకే ఆ జంటకు బుల్లితెర మీద అంత డిమాండ్. జబర్దస్త్ లోనూ ప్రతి టీమ్ లీడర్.. సుధీర్ ను తమ టీమ్ లో కాసేపయినా కనిపించాలంటూ అప్పుడప్పుడు అడుగుతుంటారు. ఏది ఏమైనా.. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ కు ఉన్నంత క్రేజ్ ఇంకెవరికీ లేదు.

rocking rakesh calls sudigali sudheer as mallu uncle in skit
rocking rakesh calls sudigali sudheer as mallu uncle in skit

అయితే.. సుధీర్ పై సెటైర్లు వేస్తూ కొందరూ ప్రేక్షకులను నవ్వించాలని చూస్తుంటారు. ఎప్పుడూ జరిగేది అదే. ప్రతి టీమ్ లీడర్.. సుధీర్ పై పంచ్ వేసి.. ఆ పంచ్ వల్ల నవ్వు తెప్పించాలని చూస్తుంటారు.

తాజాగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లోనూ రాకింగ్ రాకేశ్ అదే చేశాడు. తన స్కిట్ లోకి గెస్ట్ గా సుధీర్ ను పిలిచి.. మల్లు అంకుల్ అంటూ అవమానించాడు. ఈయన మాకు మల్లు అంకుల్ మాదిరి అంటూ అందరి ముందు పరువు తీసేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.