రోహిత్ హాఫ్ సెంచరీ

68 views

బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగియడానికి ఇంకా 12 ఓవర్లు ఉండగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 424 పరుగులతో ఆడుతోంది.

రోహిత్ శర్మ  53 పరుగులతోనూ, రిషభ్ పంత్ 34 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. అంతకు ముందు ఛటేశ్వర్ పుజారా 106 పరుగులకు, కెప్టెన్ కోహ్లీ 82 పరుగులకు, వైస్ కెప్టెన్ 34 పరుగులకు ఔటయ్యారు. బౌన్సీ పిచ్ పై బ్యాటింగ్ ఒకింత కష్టంగా ఉన్నప్పటికీ భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ రాణించారు.