ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఆంధ్ర రాజకీయాలు ఒక్క సారిగా హీటెక్కిన విషయం తెలిసిందే. ఒకపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ కుట్ర పూరితంగా అచ్చెన్నాయుడు ని అరెస్టు చేయించాడని ఆరోపిస్తూ ఉంటే ప్రభుత్వం వారు మాత్రం ఏసీబీ అధికారుల దగ్గర్ పక్కా ఆధారాలు ఉన్నాయని ఈరోజు సాయంత్రం అతడిని కోర్టులో ప్రవేశపెట్టినపుడు అసలు విషయం తెలుస్తుందని కౌంటర్ లు ఇస్తున్నారు.
అయితే అధికార పార్టీ నుంచి వారి ఫైర్ బ్రాండ్ నేత, నగిరి ఎమ్మెల్యే రోజా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా అచ్చెన్నాయుడు అధికార పార్టీ పై ఎగిరెగిరి పడుతుంటే అసెంబ్లీలో రోజా అతనికి గట్టి కౌంటర్ లు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె అతని అరెస్ట్ విషయంపై ప్రస్తావిస్తూ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని… అసలు సినిమా ముందు ముందు ఉన్నట్లు చెప్పడం విశేషం.
ఇప్పుడు బయటకు వస్తున్న వార్తల ప్రకారం మరొక తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేని పైన కూడా ఎసిబి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టిడిపి హయాంలో పనిచేసిన మంత్రులు అందరి గుట్టుని బయటికి తీసే విధంగా వైఎస్ఆర్సిపి వ్యూహాలు రచిస్తోందని రోజా మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు.
ఇంకా అసలు సినిమా ముందు ఉంది అని రోజా అంటుంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న టిడిపి వారి గతాన్ని కూపీ లాగి అందరినీ జైల్లో వేయించడమేనా అని రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు బుర్ర గోక్కుంటున్నాడు. దానికి కూడా రోజమ్మే సమాధానం చెప్తే మంచిదేమో..?