న్యూస్ సినిమా

రోజా జన్మలో మర్చిపోలేని పని చేసిన రోజా కూతురు… కంటతడి పెట్టుకున్న తండ్రి

రోజా జన్మలో మర్చిపోలేని పని చేసిన రోజా కూతురు… కంటతడి పెట్టుకున్న తండ్రి
Share

వైసీపీ ఎమ్మెల్యే, రోజా సెల్వమణి మరియు డైరెక్టర్ సెల్వమణి లకు ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. వారి గారాల పట్టి అన్షుమాలిక వయసులో చిన్నదైనా ప్రతి సందర్భంలోనూ  తన పెద్దమనసు ను చాటుకుంటోంది. రోజా కుటుంబం హైదరాబాద్ లోని మణికొండలో ఉండే సమయంలో అన్షుమాలిక చేసే పనులను రోజా ఇటీవల తెలియజేసారు. అక్కడ దగ్గరలోని భవన నిర్మాణ పనులు చేసే పిల్లలను తన ఇంటికి తీసుకువచ్చి వారికి భోజనం పెట్టేదట. అలాగే ఆ పిల్లలు చదువుకోవడానికి మరియు రాసుకోవడానికి పుస్తకాలు,  కొన్ని పెన్నులు, పెన్సిళ్లు ఇచ్చేవారట. ఈ విషయాన్ని స్వయంగా రోజా సెల్వమణి తెలియజేశారు. ఇటీవల  రోజా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె, అన్షుమాలిక గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. 

రోజా జన్మలో మర్చిపోలేని పని చేసిన రోజా కూతురు… కంటతడి పెట్టుకున్న తండ్రి

అన్షుమాలిక కు ఎంతో ఇష్టమయిన పని పిల్లలు చదువుకునేందుకు సహాయం చెయ్యడమేనట. అటువంటి పిల్లల కోసం సాయం చేస్తూ ఉంటుందని రోజా చెప్పారు. పిల్లలకు అప్పుడప్పుడు ఏదో సహాయం చెయ్యడం కాదు. అన్షుమాలిక, చీర్స్ ఫౌండేషన్‌లో ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారట. వారి పూర్తి చదువు బాధ్యత తానే తీసుకుందట. అంతేకాకుండా తన ఫ్రెండ్స్‌ను కూడా ఇటువంటి సేవలలో పాలుపంచుకునేలా చేస్తుంది. అన్షు ఎప్పుడూ అందరినీ ప్రోత్సహిస్తూ సమాజ సేవ చేస్తోందట. ఈ సందర్భంలో అన్షు తండ్రి RK సెల్వమణి మాట్లాడుతూ తన కూతురు ఇప్పటికే సుమారు 100 మంది మెరిట్ స్టూడెంట్లను విదేశాల్లో చదివేందుకు ప్రోత్సహించేలా ఓ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుందని చెపుతూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. 

ఇటీవల అన్షుమాలిక, షిఫ్టింగ్ పర్సెప్షన్స్ అనే బుక్ ను రాసారు. చెన్నైలో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఆమె షిఫ్టింగ్ పర్సెప్షన్స్ అనే బుక్, ఒకే అంశం మీద భిన్నమైన మనస్తత్వాలు ఉన్నవారు భిన్న ప్రాంతాలకు చెందిన వారు, ఎలా స్పందిస్తారనే అంశంపై రాసిందట. 


Share

Related posts

లైన్ లో నెక్స్ట్ ఈయనే: ఆ కమ్మ మాజీ మంత్రి మీద జగన్ పేషీలో ఫైల్ సిద్ధం?

CMR

బాబాయ్ కే షాక్ ఇచ్చాడు

Siva Prasad

Breaking: ఆ రోజే మా ఎన్నికలు.. తేదీ ఖరారు…!

amrutha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar