NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం వెనుక చంద్ర‌బాబు…రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అంతర్వేది దేవాల‌యంలో ర‌థం ద‌గ్ద‌మ‌వ‌డం అనేక మందిని క‌ల‌చి వేస్తోంది. దీనిపై ఏపీఐఐసీ చైర్ప‌ర్స‌న్, పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అంతర్వేది ఘటన తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు కుట్ర అ‌ని ఆరోపించారు. అంత‌ర్వేది ఘ‌ట‌న‌ చంద్ర‌బాబు కుట్ర అని ఎందుకు అంటున్నానంటే అంటూ రోజా త‌న వాద‌న వినిపించారు.

చ‌రిత్ర చూస్తే….
తాను చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం వెనుక కార‌ణాలు ఉన్నాయ‌ని రోజా పేర్కొన్నారు. “గ‌‌తంలో తుని రైలు త‌గ‌ల‌బెట్టిన సంఘ‌ట‌న‌లో కానీ, రాజ‌ధాని రైతుల పంట‌పొలాలు కాల్చిన ఘ‌ట‌న‌లో కానీ తెలుగుదేశం పార్టీ వారు చేసి, వైయ‌స్ఆర్‌సీపీ మీద నింద‌లు వేయాల‌ని చూశారు. అధికారంలో ఉన్న ఐదు సంవ‌త్స‌రాల్లో కూడా ప్రూవ్ చేయ‌లేక‌పోయారు. ఎందుకంటే మేం చేయ‌లేదు కాబ‌ట్టి నిరూపించ‌లేక‌పోయాం“ అని వెల్ల‌డించారు.

ఇప్పుడు జ‌గ‌న్‌పై కొత్త కుట్రం
గ‌తంలో గొడ‌వ‌లు, ఇప్పుడు ఒక‌ మ‌తాన్ని ఆపాదించాలని కొంద‌రు చూస్తున్నార‌ని రోజా పేర్కొన్నారు. “వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏ విధంగానైనా చెడుగా ప్ర‌చారం చేయాల‌నే ఉద్దేశంతో అంత‌ర్వేది కుట్రకు పూనుకున్నారు. సీబీఐ ఎంక్వై‌రీ అని అడ‌గ‌డానికి చంద్ర‌బాబుకు అర్హ‌తే లేదు. చంద్ర‌బాబు ముఖ్యమంత్రిగా ఉన్న‌పుడు రాష్ట్రానికి సీబీఐ రాకూడ‌ద‌ని జీవో ఇష్యూ చేసిన పెద్ద‌మ‌నిషి, త‌న ఆస్తుల మీద సీబీఐ ఎంక్వ‌యిరీ వే‌సుకోమంటే వేసుకోన‌న్న పెద్ద‌మ‌నిషి ఈ రోజు మాత్రం సీబీఐ ఎంక్వయిరీ అడుగుతున్నారు, మేం త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టి శ్రీ‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు త‌న చిత్త‌శుద్ధిని నిరూపించుకుంటూ సీబీఐ ఎంక్వాయిరీకి కూడా ఆదేశిస్తూ.. కేంద్రాన్ని కోరారు“ అని జ‌గ‌న్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆడే కుల రాజ‌కీయాల‌కు. నీతిమాలిన రాజ‌కీయాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తూ, అంతర్వేది రథం దగ్ధం పై సీబీఐ ఎంక్వైరీలో కుట్రదారులు ఎవరో త్వరలోనే బయటకు వస్తారని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

పాద‌యాత్రలోనే జ‌గ‌న్
త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌లో మ‌హిళ‌ల క‌ష్టాలు నేరుగా చూసి వారి క‌న్నీళ్లు తుడ‌వాల‌న్న ఆలోచ‌న‌తో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ మేనిఫెస్టో రూపొందించారని ఆర్కే రోజా అన్నారు. తాను ఇచ్చిన ప్ర‌తి వాగ్ధానాన్ని కూడా నెర‌వేరుస్తున్నారని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా చంద్ర‌బాబు నాయుడు పుణ్య‌మా అని రాష్ట్రం రూ. 3.5ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో ఉన్నా ఈ క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వాటిని కుంటి సాకులుగా చూప‌కుండా తాను ఇచ్చిన మాట ప్ర‌కారం పేదలందరికీ అండ‌గా ఉంటూ, ఆర్థికంగా స‌హాయం చేస్తూ ముందుకు వెళ్ల‌డం అనేది ప్ర‌తి ఒక్క‌రు కూడా అభినందించే విష‌యం అని రోజా అన్నారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మ‌లు దాదాపుగా 90 ల‌క్ష‌ల మంది వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కం ద్వారా ఈరోజు ల‌బ్ధి పొందారని అన్నారు.

author avatar
sridhar

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju