Roman Prostitutes Tokens : పూర్వకాలంలో ఏ రాజ్యంలో అయినా రాజముద్ర ఉన్న నాణేలు చెలామణిలో ఉండేవి. అయితే రోమన్ రాజ్యంలో రెండవ శతాబ్దంలో రెండు రకాల నాణాలు చెలామణిలో ఉన్నాయట. అది ఎందుకు ఆ కథ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రోమన్ రాజ్యంలో నాడు రాజు బొమ్మ ముద్రించబడిన నాణేలు ఉండేవి. వాటిని అన్ని అవసరాలకు అంటే క్రయ విక్రయాలకు ఉపయోగించేవారు. అయితే భూమిపై దేవుడిలా భావించే రాజును అపవిత్రం చేయకూడదన్న ఉద్దేశంతో ఈ నాణేలను వేశ్యా వాటికలో వాడకాన్ని రాజు నిషేదించారుట. నాడు ఈ నిబంధన అతిక్రమించిన ఓ వ్యక్తికి రాజు ఉరి శిక్ష కూడా అమలు చేశారట.
ఈ సమస్యకు పరిష్కారంగా వేశ్యా వాటికలో టోకెన్ సిస్టమ్ ను ప్రారంభించారుట. ఈ టోకేన్ విధానంలో భాగంగా వేశ్యా గృహ నిర్వహకులే కొత్త నాణాలను ముద్రించారుట. ఆ నాణేలు కేవలం వేశ్యావాటికలోనే చెల్లుబాటు అవుతాయి. రాజముద్ర అన్న నాణాలను అక్కడ ఇస్తే దానికి సమానమైన శృంగార భంగిమలు ముద్రించి ఉన్న వారి నాణాలను ఇచ్చేవారు. వారు వారి అవసరాలకు ఖర్చు చేసుకోగా మిగిలిన నాణాలను వారికి ఇస్తే వారు వాటికి సమానంగా రాజముద్ర ఉన్న నాణాలను ఇచ్చేవారుట. అంటే ప్రస్తుతం ఇతర దేశాలకు వెళ్లే సమయంలో కరెన్సీని మార్చుకున్నట్లుగా నాటి కాలంలో వేశ్యా వాటికకు వెళ్లాల్సిన వారు కరెన్సీ మార్చుకుని వెళ్లే వారు అన్నమాట.
Roman Prostitutes Tokens: వేశ్యా వాటికల్లో వాడిన రోమన్ నాణాలు ఎలా ఉండేవో మీరు చూడండి..