న్యూస్ సినిమా

Kartikeya : కార్తికేయ – రుహాని శర్మ కాంబినేషన్‌లో రొమాంటిక్ మూవీ..!

Share

Kartikeya : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు కార్తికేయ. కార్తికేయ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు సక్సెస్ ఇవ్వలేదు. ఇక ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాతో వచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రస్తుతం ‘రాజా విక్రమార్క’ అనే సినిమాతో రాబోతున్నాడు.

romantic movie in Kartikeya-Ruhani sharma combo
romantic movie in Kartikeya-Ruhani sharma combo

ఈ సినిమాలో నటిస్తున్న కార్తికేయ, త్వరలో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో మరో సినిమా చేయనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో పాన్ ఇండియా సినిమాలతో పాటు మీడియం బడ్జెట్, చిన్న చిత్రాలు నిర్మిస్తున్నారు. అలానే ‘యూవీ కాన్సెప్ట్స్’ అనే అనుబంధ సంస్థలో చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’ మూవీని నిర్మించి హిట్ అందుకున్నారు.

Kartikeya : కార్తికేయకి జంటగా రుహానీ శర్మ నటిస్తోందని సమాచారం.

కాగా ఇదే క్రమంలో ఇప్పుడు కార్తికేయతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ అనే దర్శకుడిని ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారట. ఇక ఇందులో కార్తికేయకి జంటగా రుహానీ శర్మ నటిస్తోందని సమాచారం. ఈమె ‘చి ల సౌ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరి’ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న ‘101 జిల్లాల అందగాడు’ సినిమాలో అవసరాల శ్రీనివాస్ సరసన నటిస్తోంది.


Share

Related posts

రివ్యూ : షకీలా (బయోపిక్)

siddhu

రాష్ట్ర విభజన సమస్యలపై 27న కీలక భేటీ .. కేంద్ర హోంశాఖ రూపొందిన అజండా ఇది.. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma

Bigg Boss 5 Telugu: ఇంటా బయట టార్గెట్ అయిపోయిన ఆ కంటెస్టెంట్..!!

sekhar