NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో రోష‌న్ – వెంక‌ట్రాజు ఫైన‌ల్‌… వైసీపీలో కొత్త గుబులు…!

Roshan - Venkatraju Final in TDP New tension in YCP...!

చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు సీట్ల‌ను నాన్చి నాన్చి ఇస్తారేమో అని పిచ్చ టెన్ష‌న్‌తో ఉన్న చింత‌ల‌పూడి, గోపాల‌పురం సీట్ల‌ను ఎట్ట‌కేల‌కు నోటిఫికేష‌న్‌కు ముందే తేల్చేయ‌డంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల టీడీపీ కేడ‌ర్‌లో సంబ‌రాలు మామూలుగా లేవు. చంద్ర‌బాబు ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌ని విధంగా ఈ ఇద్ద‌రు క్యాండెట్ల‌ను రంగంలోకి దించ‌డంతో ఉమ్మ‌డి ప‌శ్చిమ‌లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి గెలుపు గుబులు ప‌ట్టేసుకుంది. ఇద్ద‌రూ కొత్త క్యాండెట్లు.. పార్టీ కోసం గ‌త కొన్నేళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్న నేత‌లు. క్లీన్ ఇమేజ్‌… యంగ్ లీడ‌ర్లు కావ‌డంతో పాటు ఎవ్వ‌రికి ఎలాంటి మ‌ర‌క‌లు లేవు.

ఇద్ద‌రూ విదేశాల్లో ఉన్న‌త ఉద్యోగాలు వ‌దులుకుని.. సొంత గ‌డ్డ‌పై మమ‌కారంతో ప్ర‌జాసేవ చేయాల‌ని వ‌చ్చిన వాళ్లే..! టీడీపీ అంటే ఇష్టంతో ఉన్నవాళ్లే.. చాలా మంది నేత‌ల్లాగా జంపింగ్ రాజ‌కీయాలు చేసిన చ‌రిత్ర లేని వాళ్లు. పైగా ఇద్ద‌రూ తొలిసారి అసెంబ్లీకి పోటీ ప‌డుతున్న నేత‌లు. ఇద్ద‌రూ రాష్ట్ర‌, స్థానిక స‌మ‌స్య‌ల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లోకి దూసుకు పోతున్నారు. ఇద్ద‌రికి నోటిఫికేష‌న్‌కు ముందే టిక్కెట్‌పై క్లారిటీ వ‌చ్చేయ‌డంతో మ‌రింత దూసుకుపోనున్నారు. పైగా ప‌క్క ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ స్ట్రాట‌జీకే దిమ్మ‌తిరిగేలా చంద్ర‌బాబు ఈ ఇద్ద‌రిని ఎంపిక చేయ‌డం కూడా వైసీపీని బాగా టెన్ష‌న్ పెట్టేస్తోంది.

మ‌ద్దిపాటి పార్టీలో గ‌త ప్ర‌భుత్వంలోనే లెడ్‌క్యాప్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాక చంద్ర‌బాబు, లోకేష్‌ను మెప్పించి పార్టీ ప్రోగ్రామ్ క‌మిటీ చైర్మ‌న్‌గాను, ఇటు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగాను ఎంపికై ఈ రెండు ప‌ద‌వుల‌కు వ‌న్నె తెచ్చారు. యేడాదిన్న‌ర క్రితం గోపాల‌పురం పార్టీ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు చేప‌ట్టి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ఉరుకులు ప‌రుగులు పెట్టించేశారు. గ‌త ఎన్నిక‌ల్లో భారీ తేడాతో ఓడిన చోట ఈ రోజు నోటిఫికేష‌న్ రాకుండానే… అటు అధికార ప‌క్షం నుంచి హోం మంత్రి పోటీలో ఉన్నా మ‌ద్దిపాటికి ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోందంటే ప్ర‌జ‌ల్లో అత‌డి ప‌ట్ల ఉన్న న‌మ్మ‌కంతో పాటు యంగ్ లీడ‌ర్ కావ‌డం.. అటు చంద్ర‌బాబు, లోకేష్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే నేత కావ‌డంతో రేపు పార్టీ అధికారంలో వ‌స్తే గోపాల‌పురం ప్ర‌జ‌ల ద‌శ‌, దిశ మార‌తాయ‌ని.. వెన‌క‌ప‌డిన మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌న్న న‌మ్మ‌కం, ఆశ‌లు ఉండ‌డ‌మే.

ఇక సొంగా రోష‌న్ కూడా ఫ‌స్ట్ టైం ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ పార్టీ టిక్కెట్ ఆశించారు. గత ఎన్నిక‌ల్లో సీటు రాక‌పోయినా పార్టీనే అంటిపెట్టుకుని కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌చ్చారు. ముఖ్యంగా క‌రోనా టైంలో రోష‌న్ చేసిన కార్య‌క్ర‌మాలు పార్టీల‌కు, వ‌ర్గాల‌కు అతీతంగా ఆయ‌న్ను చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చేరువ చేశాయి. మిష‌న్ హోప్ స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా విస్తృత సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డం ఆయ‌న‌కు ప్ల‌స్ పాయింట్‌. రోష‌న్ అభ్య‌ర్థిత్వ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలో ఒకే రాగం వినిపిస్తుండం చాలా ప్ల‌స్ అయ్యింది.

ఏదేమైనా జ‌గ‌న్ ఎత్తుల‌కు చంద్ర‌బాబు పై ఎత్తులు వేస్తూ స‌రికొత్త స్ట్రాట‌జీతో ముందుకు రావ‌డం వైసీపీ వ‌ర్గాలే మింగుడు ప‌డ‌డం లేదు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా వారు ఒక‌టి అనుకుంటే.. ఇక్క‌డ మ‌రొక‌టి జ‌ర‌గ‌డం… త‌మ సీన్ రివ‌ర్స్ అవుతుండ‌డంతో వైసీపీ వాళ్లు క‌క్క‌లేక‌.. మింగ‌లేక ఉంటోన్నారు.

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N