Crime News: కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతాడు అన్న సామెత మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హత్యకు గురైయ్యారు. ఈ ఘటనలు ఆయా ప్రాంతాల్లో తీవ్ర సంచలనం అయ్యాయి. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాజర్ ఘాట్ వద్ద ఒక రౌటీర్ పై మరో రౌడీ షీటర్ దాడి చేసి హత్య చేశారు. అధిపత్య పోరు, పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. బంజారాహిల్స్ రౌడీ షీటర్ ఫిర్దోజ్ పై మరో షీటర్ దాడి చేసి చంపేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలే ఈ హత్య కు కారణం అని భావిస్తున్నారు. మొత్తం ముగ్గురు కలిసి కత్తులతో దాడి చేసి ఫిర్దోజ్ ను హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రజలు చూస్తుండగానే కత్తులతో ఫిర్దోజ్ ను వెంబడించడంతో అక్కడ ఉన్న భయంతో పరుగులు తీశారు.

మరో ఘటన ఏపిలోని గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పాండురంగపేటకు చెందిన రౌడీ షీటర్ ప్రశాంత్ దారుణ హత్యకు గురైయ్యాడు. గతంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న ప్రశాంత్ గత కొంత కాలంగా గుంటూరులో ఉంటున్నాడు. అతను ఇవేళ తెనాలికి రాగా మాస్కులు ధరించిన వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ టౌన్ పద్మావతి కళ్యాణ మండపం రోడ్డులో ఈ హత్య జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
‘బడ్జెట్ లో ఏపికి మొండి చేయి!’