“రాయలిటీ” ఎక్కడికీ పోదు..! రికార్డుస్థాయి బుకింగులు..!

 

రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి బైక్ వస్తుందంటే అందరి చూపు అటువైపే ఉంటుంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ కొత్త బైక్ లాంచ్ అయిన తరువాత వినియోగదారులనుంచి మంచి స్పందన వస్తోంది..! మన దేశీయ మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు యమా జోరుగా ఉన్నాయి.. ఎంతలా అంటే..?ఈ బైక్‌కు కేవలం 15 రోజుల్లో 8000 కి పైగా బుకింగ్‌లు వచ్చాయి..! ఇంతలా ఆకర్షించిన ఈ బైక్ ఈ సంవత్సరానికి ఆరు శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా నవంబర్ నెలలో మొత్తం 63,782 యూనిట్లను విక్రయించింది.

 

 

ఇది 2019 లో నవంబర్ నెలలో 60,411 యూనిట్లగా ఉంది. గత నెలలో కంపెనీ మొత్తం 59,084 యూనిట్లను దేశ వ్యాప్తంగా విక్రయించింది. మార్కెట్లో మీటియోర్ 350 కొత్తగా ప్రారంభించిన ఊపందుకుంటున్నది.. దీని ధరవినియోగదారులకు అందుబాటులో ఉంది. అందువలన ఇది పోటీదారులకు కఠినమైన పోటీని ఇస్తుంది. హోండా ఇటీవలే దీనితో పోటీ పడటానికి హైనెస్ సిబి 350 ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఇది మార్కెట్లో ఉన్నప్పటికీ, మీటియోర్ 350 మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకోవడం విశేషం..

 

 

చాలామంది వాహనప్రియులు ఎక్కువగా ఇష్టపడే ద్విచక్ర వాహనాలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి . మాములుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ చూడటానికి చాలా లగ్జరీగా ఉంటుంది. అంతేకాకుండా ఒక హుందా రైడింగ్ ని ఇస్తుంది. మన దేశీయ మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు యమా జోరుగా ఉన్నాయి. ఇది ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు ఎడిషన్లలో లభిస్తుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మీటియోర్ బైక్ 349 సీసీ సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఎస్ఓహెచ్ సీ ఇంజిన్ ను కలిగి ఉండి 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 4000 ఆర్పీఎం వద్ద 27ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. రెట్రో లుక్ తో ఉండి మోడ్రన్ టచ్ తో అందుబాటులో వచ్చింది. ఈ సరికొత్త బైక్ కనెక్టెడ్ సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, గూుగల్ మ్యాప్స్ తో టిప్పర్ నేవిగేషన్ టెక్నాలజీని ఇందులో ఉన్నాయి.