RRR : ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కాకుండానే భారీ లాభాలు.. రాజమౌళి సత్తా అదే మరి..!

Share

RRR : ఆర్.ఆర్.ఆర్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమా. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ – అలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, శ్రియ శరణ్..తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, ఫస్ట్ లుక్స్ సినిమా మీద విపరీతంగా అంచనాలు పెంచాయి.

rrr-are in profit before release... that is rajamouli
rrr-are in profit before release… that is rajamouli

కాగా సంవత్సరం పాటు ప్రాజెక్ట్ లేటవడం..కరోనా కారణంగా పరిస్థితులన్ని తారుమారవడంతో ఆర్.ఆర్.ఆర్ సినిమా బిజినెస్ మీద అందరికీ ఎన్నో అనుమానాలుండేవి. నిర్మాతకి లాభాలు వస్తాయా..అసలు ఆర్.ఆర్.ఆర్ సినిమాని థియేటర్స్ లో చూసేందుకు జనాలు థియేటర్స్ వరకు వెళతరా..ఇలాంటి సందేహాలు ఎన్నో. కానీ రాజమౌళి స్టామినా ఏంటో ఇప్పటికే జరిగిన బిజినెస్ చెబుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుపై అన్ని భాషల్లోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని రేంజ్ లో జరుగుతోందట. ఆర్.ఆర్.ఆర్ సినిమా బిజినెస్ డీల్స్ అన్ని ఇప్పటికే క్లోజ్ అయినట్లు సమాచారం. విజయదశమి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తమిళ థియేట్రికల్ హక్కులు కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు.

RRR : ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ దాదాపు 300కోట్ల లాభాలలోకి వచ్చేసిందని టాక్ వినిపిస్తోంది.

ఇక కర్ణాటకలో ఏషియన్ మరియు వారాహి సంస్థలు ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా నార్త్ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ని ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ వారు కొనుగోలు చేశారు. అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్-డిజిటల్-శాటిలైట్ హక్కులను కూడా పెన్ స్టూడియోస్ వాళ్లే దక్కించుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 750 కోట్ల వరకు జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ దాదాపు 300కోట్ల లాభాలలోకి వచ్చేసిందని టాక్ వినిపిస్తోంది.


Share

Related posts

Bharat Bandh : రేపటి బంద్ కి వైసీపీ రియాక్షన్…

siddhu

కేరళ ప్రభుత్వం మరో ముందగుడు..! పర్యావరణ రక్షణకు సీఎం కీలక నిర్ణయం..!!

bharani jella

ఐపీఎల్ స్పాన్సర్ ఇక రాందేవ్ బాబా పతాంజలి?

sekhar