RRR: ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్టయిన సినిమాలలో సింహాద్రి, యమదొంగ మంచి క్రేజ్ సంపాదించటం మాత్రమే కాక.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేయటం జరిగాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు సినిమాలు… ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు గా పేరు సంపాదించాయి. అయితే 2 సినిమా షూటింగ్ లలో ఎన్టీఆర్ కి గాయాలు అయ్యాయి.
దీంతో ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో “RRR” లో కూడా గాయం అయినట్లు వార్తలు రావడంతో కచ్చితంగా మళ్లీ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని.. అతిపెద్ద భారి బ్లాక్ బస్టర్ అవుతుందని.. అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో… సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని సినిమా యూనిట్ చెబుతోంది. మరోపక్క అక్టోబర్ 13వ తారీకు రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి.
ఈ తరుణం లో సినిమాలో ఎన్టీఆర్ కి స్టార్టింగ్ లోనే గాయాలు కావడం మాత్రమే కాక ఇటీవల కూడా గాయాలైనట్లు వార్తలు రావడంతో కచ్చితంగా సినిమా.. హిట్ అని ఎన్టీఆర్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు. వాస్తవానికి సినిమా షూటింగ్ ప్రారంభమైన టైంలో… ఇద్దరు హీరోలకు అనగా రామ్ చరణ్ కి, ఎన్టీఆర్ కి గాయాలయ్యాయి. ఆ సమయంలో కొద్ది నెలల పాటు షూటింగ్ కూడా ఆగిపోయింది. ఏది ఏమైనా మరోసారి ఎన్టీఆర్ కి గాయాలైనట్లు వార్త రావడంతో ఒక పక్క ఫ్యాన్స్.. బాధపడుతున్నా గాని సినిమా హిట్ అవుతుందని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ కనుబొమ్మ పై చిన్నగిరి ఉన్నట్లు ఇటీవల ఫోటో ఒకటి రావటంతో.. ఫాన్స్ ఈ రీతిగా ఫిక్స్ అయిపోయారు.