RRR: బాహుబలి సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డు మొత్తం తిరగరాసి చరిత్ర సృష్టించాడు రాజమౌళి. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి తను చేసే ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ .. డిజైన్ చేస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. సంగీతంపై తనకు అంతగా పట్టు లేకపోయినా గాని అన్న కీరవాణి.. చొరవ తీసుకుని మరి స్పెషల్ సాంగ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు.
స్ట్రాంగ్ స్టోరీ ఉన్న తరుణంలోనే మరోపక్క డిఫరెంట్ సాంగ్స్ ఉండేలా కీరవాణి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న “RRR” లో కూడా ఎనిమిది నిమిషాల స్పెషల్ సాంగ్ సరికొత్త బాణీలతో ఇచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా సాంగ్ హైదరాబాద్లో సారథి స్టూడియోలో స్టార్ట్ అయినట్టు సమాచారం. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరిపై ఈ సాంగ్ షూట్ జరగనున్నట్లు టాక్.
Read more: RRR: రాజమౌళితో పనిచేసిన హీరోలలో ఆ ఘనత సాధించింది ఒక చరణ్ మాత్రమేనట..!!
అయితే స్నేహం పైన లేకపోతే వీరిద్దరు వ్యక్తిత్వం పైన సాంగ్ ఉంటుందా లేక పోతే ఇంకా ఏదైనా కొత్త తరహాలో కీరవాణి ప్లాన్ చేశారా అనేది సస్పెన్స్ గా నెలకొంది. యమదొంగ లోని నర లోకం సాంగ్ రా పెద్ద ఎన్టీఆర్ తళుక్కున మెరిసే లా.. అదే రీతిలో మగధీర సినిమాలో ఫైనల్ సాంగ్ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరూ రావడం.. ఇక సై సినిమా లో షాపుల కాన్సెప్ట్ పై సాంగ్స్ చేయడం ఇలా డిఫరెంట్ గా కీరవాణి సాంగ్స్ ఇవ్వటంతో ప్రస్తుతం చెర్రీ ఎన్టీఆర్ కోసం ఏకంగా ఎనిమిది నిమిషాల్లో సాంగ్ అది ఏ కాన్సెప్ట్ అనేది సినిమా ఆడియన్స్ కి అభిమానులకి ఉత్కంఠగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?