RRR Film: విడుదలకు ముందే గర్జిస్తోన్న RRR, భారత సినీ చరిత్రలోనే అరుదైన రికార్డు!

Share

ఇప్పుడు ఎక్కడ విన్నా RRR రీసౌండే వినపడుతోంది. అవును.. బాహుబలి తరువాత దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా RRR. దాంతో మామ్మూలుగానే దీనిపైన అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక రిలీజు డేట్ దగ్గర పడటంతో జక్కన్న ప్రమోషన్స్ షురూ చేసాడు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7వ తేదీన రిలీజ్ కాబోతుంది. దాంతో అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఓ పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరో పక్క యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కావడంతో అంచనాలు భారీగానే వున్నాయి.

 

అరుదైన రికార్డు ఇదే!

ఇప్పటికే రిలీజైన RRR ట్రైలర్ భారీ రికార్డులను తిరగ రాస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత నెలకొల్పడం అటు మెగా, ఇటు నందమూరి అభిమానులను ఆనంద సాగరంలో ముంచెత్తుతోంది. ఇంతకీ విషయం ఏమంటే.. US న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ బిల్డింగ్‌‌పై ఈ సినిమా పోస్టర్‌తో పాటు పాటలను ప్రస్తుతం ప్రదర్శిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఇది అరుదైన రికార్డు అనే చెప్పుకోవాలి . ఎందుకంటే ఇలాంటి ఘనత ఇంతవరకు మరే సినిమాకు లేకపోవడం కొసమెరుపు.

 

ప్రస్తుతం ప్రమోషన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి?

 

హైదరాబాద్ లో ముందే ప్రమోషన్స్ షురూ చేసిన టీమ్ బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి సహా పలు ప్రాంతాల్లో ప్రమోషన్స్ షురూ చేసాయి. అలాగే ఓవర్సీస్‌లో కూడా ప్రమోషన్స్ జోరు పెంచారనే చెప్పాలి. జక్కన్న స్ట్రాటజీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లోనూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు రాజమౌళి. కాగా.. ఈ భారీ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 


Share

Related posts

BJP: వైసీపీ, టీడీపీలపై కేంద్ర మాజీ మంత్రి జవదేకర్ కీలక వ్యాఖ్యలు..

somaraju sharma

ఎపిలో పెరుగుతున్న కరోనా కేసులు: ప్రజల్లో ఆందోళన

somaraju sharma

‘విరుష్క’ లది టాప్ రిచెస్ట్ సెలబ్రిటీ జోడి.. నెట్‌వర్త్ ఎంతో తెలుసా???

Naina