న్యూస్ సినిమా

RRR మూవీ వాయిదా పడుతుందా?

Share

RRR Release: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తారాగణంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మల్టీస్టారర్ మూవీని జనవరి 7న రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇంకో రెండు వారాల్లో ఇది ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలోనే ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమాని చాలా సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న క్రమంలోనే ఇది మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్‌కు కరోనానే శత్రువు

ప్రస్తుతం భారతదేశంలో ఒమిక్రాన్ (omicron) వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనవరి 7 నాటికి ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే భారత దేశ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Film) వసూళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం కచ్చితంగా పడుతుంది.

మళ్లీ వాయిదా వైపే మొగ్గు

ఆర్ఆర్ఆర్‌ని ఎంతో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది రాజమౌళి (SS Rajamouli) బృందం. అలాంటప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమా విడుదల చేసి నష్టపోతుందా లేక సినిమాని కొన్ని రోజులు వాయిదా వేస్తుందా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్నగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఒమిక్రాన్ ఇప్పుడు అటు అభిమానులను ఇటు సినిమా బృందాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఒకవేళ జనవరి 7 నాటికి వైరస్ వ్యాప్తి తీవ్రమై.. కఠిన ఆంక్షలు అమలైతే.. సినిమా వాయిదా (RRR Release Delay) వేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తేదీ నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.


Share

Related posts

తండ్రైన విజయ్ దేవరకొండ

Siva Prasad

వామ్మో.. `ఆదిపురుష్‌` ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను అన్ని కోట్ల‌కు అమ్ముతున్నారా?

kavya N

బిగ్ బ్రేకింగ్ : నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మరోసారి సై అంటున్న మంత్రి పెద్దిరెడ్డి..!!

sekhar