NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆర్ఆర్ఆర్ ల‌క్కీగా క‌లిసొచ్చిందే.. చివ‌ర‌కు ఆ పార్టీలో ఆ సీటు ఫిక్స్…!

వైసీపీలో రెబల్ ఎంపీగా నాలుగేళ్లపాటు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసిపి నేతలను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు.. ఆ పార్టీ నరసాపురం మాజీ ఎంపీ క‌నుమూరు రఘురామకృష్ణంరాజు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఎంపీగా గెలిచిన ఏడాదికే వైసీపీతో విభేదించడం ప్రారంభించారు. నాలుగేళ్లపాటు ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటూ రచ్చబండ పేరుతో జగన్ ప్రభుత్వాన్ని.. వైసీపీని ఒక ఆట ఆడుకుంటూ సోషల్ మీడియాలో దుమ్ము లేపారు. రఘురామ జగన్ ప్రభుత్వాన్ని మామూలుగా ఆడుకోలేదు.

అయితే వచ్చే ఎన్నికలలో తాను ఏపీలో నరసాపురం పార్లమెంటు నుంచే కూటమిలో ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేస్తాను అని ముందు నుంచి చెబుతున్నారు. అయితే అది తెలుగుదేశమా.. బిజెపినా.. జనసేన అన్నది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల తాడేపల్లిగూడెం సభలోను ఆయన అదే విషయాన్ని చెప్పారు. అయితే గత నాలుగేళ్లుగా వైసిపికి దూరంగా ఉన్న రఘురామ ఢిల్లీలో బిజెపి పెద్దలతో మంచి సంబంధాలు కలిగి ఉంటూ వారి సేవలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బిజెపి సీటు ఇస్తుందా ? లేదా అన్న సస్పెన్స్ నెలకొంది.

పార్టీ మారిన రఘురామకంటే బిజెపిని ముందు నుంచి నమ్ముకున్న నేతలకే నరసాపురం పార్లమెంటు సిటు ఇస్తారన్న చర్చ బయటకు వచ్చింది. అయితే రఘురామపై ఉన్న ప్రేమతో చంద్రబాబు నరసాపురం పార్లమెంటు సీటును పొత్తులో భాగంగా తీసుకొని తెలుగుదేశం నుంచి రఘురామను పార్లమెంటుకు పోటీ చేయిస్తారని మరో ప్రచారం కూడా బయటకు వచ్చింది. అయితే ఎట్టకేలకు రఘురామ పోటీ చేసే పార్టీతో పాటు స్థానంపై క్లారిటీ వచ్చింది. గత రాత్రి బిజెపి పెద్దలు జనసేన.. టిడిపి తో జరిపిన చర్చలలో నరసాపురం పార్లమెంటు సీటును బిజెపి తీసుకోవాలని అనుకోవడంతోపాటు.. అక్కడ నుంచి రఘురామను పోటీ చేయించాలన్న క్లారిటీ వచ్చేసింది.

మొత్తం ఏపీలో 6 పార్లమెంటు స్థానాలకు బిజెపి పోటీ చేస్తుంటే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ – విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, నర్సాపురం నుంచి రఘురాం కృష్ణంరాజు, తిరుపతి నుంచి రత్నప్రభ, అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీ చేయటం ఖాయం అయింది. ఇక ఇప్పుడు మిగిలింది రఘురామ బిజెపి కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేయటం ఒక్కటే ఉంది. ఇట్టకేలకు రఘురామ పోటీ చేసే పార్టీతో పాటు పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చింది.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N