RRR : ఆర్ఆర్ఆర్ …కొమురం భీం ఎలా ఉంటాడు..?

Share

RRR : ఆర్ఆర్ఆర్ …టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్, శ్రీ శరణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్నట్టుగా బిజినెస్ అవుతుందా..బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా…ఎన్టీఆర్ – చరణ్ లకు పాన్ ఇండియన్ స్టార్స్ గా క్రేజ్ వస్తుందా..అసలు నిర్మాత సేఫ్ గా బయట పడతాడా..ఇలా ఎన్నో ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి.

rrr-how-is-komuram-bhim
rrr-how-is-komuram-bhim

కానీ కరోనా ప్రభావం ఆర్ఆర్ఆర్ బిజినెస్ మీద ప్రభావం చూపించలేదని ఇప్పటికే జరిగిన ప్రి రిలీజ్, శాటిలైట్..ఇతర భాషల రైట్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే దాదాపు 750 కోట్ల బిజినెస్ చేసిందని చెప్పుకుంటున్నారు. సినిమా బడ్జెట్ 400 కోట్లు. అంటే ఆల్రెడి ఆర్ఆర్ఆర్ లాభాలలోకి వచ్చేసిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన చరణ్, తారక్ ల టీజర్ ..ఆ మధ్య వచ్చిన ఆలియా భట్, లుక్, చరణ్ రామరాజు లుక్.. ఇటీవల వచ్చిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ లుక్ రిలీజ్ చేసి అంచనాలు భారీగా పెంచాడు రాజమౌళి.

RRR : రామరాజు ఫర్ భీం లో తారక్ ని గోండ్రు బెబ్బులిగా పరిచయం చేసిన రాజమౌళి..!

ఇప్పుడు అందరు మాట్లాడుకుంటుంది కొమురం భీం గా తారక్ ఎలా ఉంటాడు అని. రామరాజు గా చరణ్ లుక్ అదిరిపోయింది. దాంతో ఇప్పుడు భీం గా తారక్ లుక్ కోసం నందమూరి అభిమానులు..దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లోనూ ఆతృత అంతకంతా పెరుగుతోంది. మే 13న ఎన్టీఆర్ బర్త్ డేకి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వడబోతున్నాడో అని మాట్లాడుకుంటున్నారు. రామరాజు ఫర్ భీం లో తారక్ ని గోండ్రు బెబ్బులిగా పరిచయం చేసిన రాజమౌళి ఫస్ట్ లుక్ ని ఎలా రివీల్ చేయబోతున్నాడన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో ఉంది. ఇక ఈ సినిమాని అన్నీ ప్రధాన భాషల్లో అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నారు.


Share

Related posts

‘మీకు గౌరవం నావల్లే’

somaraju sharma

Corona Effect: కాంగ్రెస్ నేత ఎంఎస్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమం

somaraju sharma

మా ఆయన బంగారం అంటున్న వైయస్ భారతి రెడ్డి..??

sekhar