పనిమనిషి పనికి రూ.18 లక్షలు జీతం.. ఎక్కడంటే?

Share

ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకి దరఖాస్తులను చూశాం, కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కానీ వెరైటీగా హౌస్ కీపర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించడం మీరెప్పుడైనా చూశారా? అవును ఇది నిజమే హౌస్ కీపర్ ఉద్యోగానికి దరఖాస్తులు ప్రకటించింది మరెవరో కాదు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ విండ్సర్ కాజిల్ కోసం హౌస్ కీపింగ్ వర్కర్లు, అసిస్టెంట్లు కావాలని దరఖాస్తులను ఆహ్వానించింది.

రాజుల కుటుంబాలను చూడాలనుకునే వారు, వారి ఇళ్లలో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. అయితే ఈ ఉద్యోగానికి కొన్ని అర్హతలను ప్రకటిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగ ప్రకటన రాయల్ కుటుంబానికి చెందిన వెబ్ సైట్ నందు పొందుపరిచారు. ఈ ఉద్యోగానికి 19,140.09 పౌండ్లు.. అంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారం దాదాపుగారూ.18,38,179.22 జీవితాన్ని చెల్లించనుంది. కానీ రాజుల కుటుంబంతో మంచిగా పని చేసి వారి నమ్మకాన్ని గెలుచుకుంటే జీతం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలియజేశారు.

ఈ ఉద్యోగంలో చేరే వారికి మరికొన్ని సదుపాయాలను కూడా ఈ కుటుంబం కల్పించింది. ఉద్యోగులు పని చేయడానికి ప్యాలెస్ లో నివాసం ఉండవచ్చు. అంతేకాకుండా వారంలో కేవలం ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా ప్రకటించింది. అంతేకాదండోయ్ ఎంప్లాయిమెంట్ పెన్షన్ కూడా వీరు అర్హులే. సంవత్సరంలో 33 రోజులు జీతంతో కూడిన సెలవులను కూడా ఇవ్వనున్నారు.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కూడా కల్పించారు. దరఖాస్తును చేసుకునేవారు కచ్చితంగా ఇంగ్లీష్, మాథ్స్ గురించి మంచి పట్టుదల ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ అ అవగాహన లేకపోతే వాటిపై శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంటీరియర్ వస్తువులను శుభ్రపరచడానికి, ప్రతి వస్తువు పై ప్రత్యేక దృష్టి పెట్టి శుభ్రపరచాలని తెలియజేశారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ అక్టోబర్ 28 దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వారి డీటెయిల్స్ ను పంపించడమే.


Share

Related posts

Eatela Rajendar: ఈట‌ల రాజేంద‌ర్‌కు అదిరిపోయే షాకులు రెడీ చేస్తున్న కేసీఆర్‌

sridhar

Money: ఈ నక్షత్రం రోజు డబ్బు పొదుపు చేస్తే  అవి  రెట్టింపు అవుతాయి!!

siddhu

Vijay setupathi : విజయ్ సేతుపతికి తప్పని పరిస్థితుల్లో ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేయాల్సి వచ్చిందట..

GRK