Drug Smuggling: డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నా వివిధ దేశాల నుండి వివిధ మార్గాల్లో డ్రగ్స్ సరఫరా అవుతూనే ఉన్నాయి. దేశంలోని ఏదో ఒక ఎయిర్ పోర్టులో నిత్యం డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. నేడు చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీ డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు.
దాదాపు రూ. 5.36 కోట్ల విలువైన 1534 గ్రాముల హెరాయిన్ ను కస్టమ్స్ అధికారుుల చెన్నై విమానాశ్రయంలో సీజ్ చేశారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ మిహళ హెరాయిన్ ను కాటన్ బాక్సులలో దాచి తరలించే ప్రయత్నం చేస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సదరు సౌత్ ఆఫ్రికా నిందితురాలి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయం కిడ్నాప్ ..మధ్యాహ్నం పెళ్లి .. తండ్రికి షాక్ ఇచ్చిన కుమార్తె