NewOrbit
తెలంగాణ‌ న్యూస్

హైదరాబాద్ లో మరో సారి భారీ ఎత్తున హవాలా నగదు స్వాధీనం

Share

తెలంగాణ రాష్ట్రంలో హవాలా నగదు తరలించే దందా పెద్ద ఎత్తున జరుగుతుండటంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల తనిఖీల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో మరో సారి భారీ ఎత్తున హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూ. 70 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సత్యనారాయణపురం ద్వారకా కాలనీలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, ఓ కారు ఆగకుండా చెక్ పాయింట్ దాటి వెళ్లిపోయింది. వెంటనే అనుమానించిన పోలీసులు తమ వాహనంతో చేజ్ చేసి ఆ కారును పట్టుకున్నారు.

Rs.70 Lakhs Hawala Money Seized In Hyderabad

 

ఆ కారును తనిఖీ చేయగా నోట్ల కట్టలతో ఉన్న బ్యాంగ్ ఉండటాన్ని గమనించారు. ఆ నగదును పరిశీలించగా మొత్తం రూ.70లక్షలు ఉన్నట్లు తెలిసింది. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడం, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాటికి సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో ఇది హవాలా నగదుగా కేసు నమోదు చేశారు. ఈ హవాలా సొమ్ము తరలిస్తున్న కిషన్ రావు, వేముల వంశీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కారు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుల తరలింపునకు సంబంధించి మరో నిందితుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నగదును ఎక్కడ నుండి తెచ్చారు. ఎవరికి ఇవ్వడానికి తీసుకువెళుతున్నారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో కీలక మలుపు.. మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేసిన పోలీసుల


Share

Related posts

Corona: కరోనా కారణంగా నిర్మాతకి భారం తగ్గించిన ఆ ఇద్దరు టాప్ హీరోలు..??

sekhar

‘ఓం’ కనిపించింది – 2020 దరిద్రం వదిలిపోయింది.

Naina

Narendra Modi: ప్రధాని మెచ్చిన వీడియో..!! నరేంద్ర మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్ ఎంతో తెలుసా..!! 

bharani jella