ఆర్ఎస్ ఎస్ సంకల్ప్ రథయాత్ర ప్రారంభం

Share

అయోధ్యలో రాం మందిర్ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 10 రోజుల సంకల్ప్ రథ్ యాత్ర నేడు ఢిల్లీలో ఆరంభమైంది. రాం మందిర్ వివాదంపై సుప్రీంకోర్టు తుది విచారణ 2019 జనవరిలో చేపట్టనున్నది. సుప్రీంకోర్టు విచారణ చేపట్టక ముందే అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రాం మందిర్ నిర్మాణం పై నిర్ణయం తీసుకోవాలని ఆర్ ఎస్ ఎస్ కేంద్రంపై వత్తిడి తెస్తున్నది. ఈ 10 రోజుల రథ యాత్ర డిసెంబర్ 9న ఢిల్లీలోని రాం లీలా మైదానంలో జరిగే మహా సభతో ముగుస్తుంది. రథ్ యాత్ర ఏర్పాట్లను ఆర్ఎస్ ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ మంచ్ చూస్తున్నది. రథ్ యాత్రను ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం జండేవాలా మందిర్ నుంచి ఢిల్లీ ప్రాంత్ సంచాలక్ కుల్ భూషణ్ అహుజా ప్రారంభించారు.


Share

Related posts

Eye Sight: 5 రోజుల్లో మీ కళ్ళజోడు తీసి పక్కనపెట్టే సింపుల్ చిట్కా..!!

bharani jella

Shalini Pandey: కోలీవుడ్ మేకర్స్‌కి చుక్కలు చూపించి ముంబై చెక్కేసిన శాలినీ పాండే..!

GRK

రాష్ట్రంలో విద్యా విప్లవం తీసుకువస్తా – జగన్

somaraju sharma

Leave a Comment